Kohli VS Bavuma: కోహ్లితో బవుమా గొడవ.. ఏం జరిగింది?

19 Jan, 2022 19:45 IST|Sakshi

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 36వ ఓవర్‌ నాలుగో బంతిని కెప్టెన్‌ బవుమా షార్ట్‌ కవర్‌ రీజియన్‌ దిశగా ఆడాడు. అది నేరుగా కోహ్లి చేతుల్లోకి వెళ్లింది. అయితే  పంత్‌ వైపు వేసే ఉద్దేశంతో కోహ్లి బంతిని బలంగా విసిరాడు. పొరపాటున బంతి బవుమాకు తగిలినప్పటికి పెద్దగా గాయం కాలేదు.

చదవండి: టీమిండియా క్రికెటర్లకు ఘోర అవమానం..

ఇక్కడితో ఇది ముగిసిదనుకుంటే.. బవుమా కోహ్లివైపు కోపంగా చూస్తూ.. ''నేను క్రీజులోనే ఉన్నా అలాంటి త్రోలు వేయనవసరం లేదు'' అంటూ పేర్కొన్నాడు.  దీంతో కోపం పట్టలేకపోయిన మెషిన్‌గన్‌ బవుమాతో.. ''నేనేం కావాలని నిన్ను కొట్టాలనుకోలేదు.. వికెట్‌ కీపర్‌కు త్రో వేసే క్రమంలో పొరపాటున తగిలిఉంటుంది.. ఒక బ్యాట్స్‌మన్‌గా ఇది నువ్వు అర్థం చేసుకోవాలి'' అంటూ ధీటుగా బదులిచ్చాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌  ఎంచుకున్న సాతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్‌ బావుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు,  వాన్‌ డస్సెన్ 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు నాటౌట్‌గా రాణించారు. వీరిద్దరు చెలరేగి ఆడటంతో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది.  ఏకంగా ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. నాలుగో వికెట్‌కి రికార్డ్‌ పార్ట్‌నర్ షిప్ 204 పరుగులను సాధించారు. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసి భారత్‌కి భారీ టార్గెట్‌ని విధించారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్‌ అశ్విన్ ఒక వికెట్‌ సాధించారు.

చదవండి: 'బులెట్‌ వేగం'తో మార్క్రమ్‌ను దెబ్బకొట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌

మరిన్ని వార్తలు