Virat Kohli: 732 రోజులు.. సెంచరీ కోసం పరితపిస్తున్నాడు!

23 Nov, 2021 19:40 IST|Sakshi

టీమిండియా మెషిన్‌గన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ చేసి రెండేళ్లవుతుంది. దాదాపు 732 రోజులు పాటు కోహ్లి ఒక్క ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేకపోయాడు. ఆఖరుగా కోహ్లి సెంచరీ చేసింది 2019లో.. అది బంగ్లాదేశ్‌తో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో చేశాడు.ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి  ఇప్పుడు మాత్రం ఒక్క సెంచరీ కోసం పరితపిస్తున్నాడు. 

చదవండి: 2025 చాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్తాన్‌లో.. ఐసీసీకి పెద్ద సవాల్‌

టి20 ప్రపంచకప్‌ 2021 ముగిసిన అనంతరం టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న కోహ్లి.. తాజాగా కివీస్‌తో జరిగిన టి20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఇక నవంబర్‌ 25 నుంచి జరగనున్న తొలి టెస్టుకు దూరంగా ఉండనున్న కోహ్లి రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ముంబైలోని క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్‌ ప్రారంబించాడు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసిన కోహ్లి.. గ్రౌండ్‌ మొత్తం పరిగెత్తి తన ఫిట్‌నెస్‌ లెవెల్‌ను పెంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ కోహ్లి ఫ్యాన్‌ ఒకరు ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక డిసెంబర్‌ 3 నుంచి ముంబై వేదికగా జరగనున్న రెండో టెస్టులో కోహ్లి సెంచరీ చేయాలని అతని ఫ్యాన్స్‌ బలంగా కోరుకుంటున్నారు.  

►కోహ్లి చివరి సెంచరీ తర్వాత 12 టెస్టుల్లో 563 పరుగులు చేశాడు. 
►732 రోజుల్లో కోహ్లి ఐదు హాఫ్‌ సెంచరీలు మాత్రమే చేశాడు.
►గత 21 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి మూడుసార్లు డక్‌.. నాలుగుసార్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం
►అన్ని ఫార్మాట్లు కలిపి 56 ఇన్నింగ్స్‌లుగా కోహ్లి సెంచరీ చేయలేకపోవడం ​ఇదే తొలిసారి

చదవండి: KL Rahul: కివీస్‌తో టెస్టుకు ముందు బిగ్‌షాక్‌.. గాయంతో కేఎల్‌ రాహుల్‌ ఔట్‌

మరిన్ని వార్తలు