ఇంగ్లండ్‌తో ఫైన‌ల్‌.. కుర్రాళ్లకు విరాట్ కోహ్లి కీలక సూచనలు!

4 Feb, 2022 13:24 IST|Sakshi

అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్ తుది స‌మ‌రానికి చేరుకుంది. శ‌నివారం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో ఇంగ్లండ్‌తో భార‌త్ త‌ల‌ప‌డునంది. ఈ నేప‌థ్యంలో ఫైనల్‌కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి భార‌త యువ ఆట‌గాళ్ల‌కి కీల‌క సూచ‌న‌లు చేశాడు. భార‌త యువ ఆట‌గాళ్ల‌తో కోహ్లి ఆన్‌లైన్ ఇంటరాక్షన్ అయ్యాడు. విరాట్ తన కెప్టెన్సీలో 2008లో భారత జట్టును అండర్-19 ఛాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లితో సంభాష‌ణ‌కి సంబంధించిన వీడియోను అండ‌ర్‌- ఆట‌గాళ్లు కౌశల్ తాంబే, రవ్‌జర్ధన్ హంగర్గేకర్ ఇన‌స్ట్రాగ‌మ్‌లో పోస్ట్ చేశారు. "ఫైనల్స్‌కు ముందు కింగ్ కోహ్లి మాకు కొన్ని విలువైన చిట్కాలు, సూచ‌న‌లు అందించాడు" అని కౌశ‌ల్ తాంబే క్యాప్ష‌న్‌గా పెట్టాడు.

"విరాట్ భ‌య్యా... మీతో సంభాషించడం చాలా బాగుంది . మీ నుంచి జీవితం, క్రికెట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాను. నాకు అవి రాబోయే కాలంలో మరింత మెరుగవడానికి సహాయపడతాయి" అని హంగర్గేకర్ రాసుకొచ్చాడు. అండ‌ర్-19 ప్రపంచ క‌ప్‌లో టీమిండియా వ‌రుస‌గా నాలుగో సారి ఫైన‌ల్‌కు చేరింది. భారత అండర్‌–19 జట్టు నాలుగు సార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. 2000లో (కెప్టెన్‌ మొహమ్మద్‌ కైఫ్‌), 2008లో (కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి), 2012లో (కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌), 2018 (కెప్టెన్‌ పృథ్వీ షా) జట్టు చాంపియన్‌గా నిలిచింది. మరో మూడు సార్లు (2006, 2016, 2020) ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

చ‌ద‌వండి: Dewald Brevis- Shikhar Dhawan: సంచలన ఇన్నింగ్స్‌.. ఒకే ఒక్క పరుగు.. ధావన్‌ రికార్డు బద్దలు.. ప్రొటిస్‌ యువ కెరటం ఏబీడీ 2.0 ఘనత

మరిన్ని వార్తలు