ఆర్‌సీబీ అభిమానినే కానీ, కోహ్లికి కాదు: రష్మిక

17 May, 2021 17:58 IST|Sakshi

బెంగళూరు: మత్తెక్కించే అందచందాలతో దక్షిణ భారత చిత్రసీమను ఉర్రూతలూగిస్తున్న కన్నడ భామ రష్మిక మంధన.. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే క్రికెట్‌ను కూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతానంటోంది. ముఖ్యంగా ఐపీఎల్‌ అంటే తనకు పిచ్చి అని పేర్కొంది. ఇటీవల సోషల్‌ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ఐపీఎల్‌లో తన ఫేవరెట్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ను ఆర్‌సీబీ ఎలాగైనా సాధించాలని ఆకాంక్షించానని, కానీ అనుకోని పరిస్థితుల్లో లీగ్‌ వాయిదా పడటం ఆర్‌సీబీ అభిమానిగా తనను చాలా బాధించిందని తెలిపింది. 

స్వతహాగా ఆర్‌సీబీ అభిమానినే అయినప్పటికీ, తన ఫేవరెట్‌ క్రికెటర్‌ మాత్రం ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కాదని వెల్లడించి, అందరిని ఆశ్చర్యపరిచింది. తనకు టీమిండియా మాజీ సారధి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోని అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అతని బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌, సారధ్యం అన్నీ తనకు బాగా నచ్చుతాయని, అతనో మాస్టర్‌ క్లాస్‌ ప్లేయర్‌ అని అభివర్ణించింది. క్రికెట్‌లో ధోని తన ఆల్‌టైమ్‌ హీరో అని ఆకాశానికెత్తింది. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న "పుష్ప" సినిమాలో నటిస్తోంది.
చదవండి: సెంచరీ చేయలేకపోయినా నీలా మ్యాచ్‌ ఫిక్సింగ్ మాత్రం చేయలేదు..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు