T20 World Cup 2022: 'టీ20ల్లో విరాట్‌ కోహ్లిని ఓపెనర్‌గా పంపండి.. ఇక రాహుల్‌ను..'

13 Sep, 2022 18:03 IST|Sakshi
PC: Bcci Twitter

టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఆసియాకప్‌తో తిరిగి తన ఫామ్‌ను పొందాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కింగ్‌ కోహ్లి.. అద్భుతమైన సెంచరీతో తన మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. దాదాపు 1000 రోజుల తర్వాత కోహ్లి తన 71వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

దాదాపు ఓపెనర్‌గా వచ్చిన ప్రతీ మ్యాచ్‌లోనూ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో అకట్టుకుంటున్నాడు. దీంతో త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌ను ఓపెనర్‌గా పంపాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టీ20ల్లో విరాట్‌ కోహ్లిని ఓపెనర్‌గా కొనసాగిస్తే కేఎల్‌ రాహుల్‌ తన స్థానాన్ని కోల్పోవలసి వస్తుందని భారత మాజీ ఆటగాడు రోహన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

"టీ20ల్లో కోహ్లిని టీమిండియా ఓపెనర్‌గా పంపాలని భావిస్తున్నాను. అతడు టీ20 క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడు. పొట్టి ఫార్మాట్‌లో విరాట్ సగటు దాదాపు 57గా ఉంది. అదే విధంగా అతడి స్ట్రైక్ రేట్ కూడా దాదాపు 160గా ఉంది. కోహ్లి తన చివరి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి ఏకంగా సెంచరీ సాధించాడు.

బహుశా కోహ్లి కూడా ఓపెనర్‌ ఆడాలని భావిస్తుండవచ్చు. ఇక కోహ్లి ఓపెనర్‌గా వస్తే రాహల్‌ తన స్థానాన్ని త్యాగం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక కోహ్లి స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను పంపాలి. అదే విధంగా రాహుల్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ వస్తే బాగుంటుంది అని గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: Urvashi Rautela: లైట్‌ తీసుకున్న పంత్‌.. చేతులు జోడించి సారీ చెప్పిన ఊర్వశి.. వీడియో వైరల్‌!

మరిన్ని వార్తలు