టి20లకు సారథ్యం వహించను: కోహ్లి

17 Sep, 2021 04:58 IST|Sakshi

ప్రపంచ కప్‌ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విరాట్‌ కోహ్లి

భారత క్రికెట్‌లో కీలక పరిణామం. మూడు ఫార్మాట్‌లలోనూ జట్టుకు నాయకత్వం వహిస్తున్న విరాట్‌ కోహ్లి టి20 కెపె్టన్సీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ప్రపంచకప్‌ తర్వాత తాను సారథ్యాన్ని వదిలేస్తానని అతను స్వయంగా ప్రకటించాడు. పని భారం తగ్గించుకునేందుకే అంటూ కోహ్లి  చెప్పుకున్నా... రోహిత్‌ శర్మ కెప్టెన్సీ గురించి పెరుగుతున్న డిమాండ్లు సహా ఇతర అంశాలు కూడా అతనిపై ప్రభావం చూపించి ఉండవచ్చు. అన్నింటిని మించి టి20 వరల్డ్‌కప్‌ తర్వాత తప్పుకునేట్లయితే టోర్నీకి ముందు అలాంటి ప్రకటన చేయడం మాత్రం అనూహ్యం.  

ముంబై: సోమవారం... టి20 ఫార్మాట్‌ కెపె్టన్సీ నుంచి కోహ్లి తప్పుకోనున్నట్లు మీడియాలో వార్తలు. దీనిని ఖండించిన బీసీసీఐ ప్రతినిధులు... సారథిగా కోహ్లినే కొనసాగుతాడని, అసలు భారత క్రికెట్‌లో వేర్వేరు కెప్టెన్ల పద్ధతి పని చేయదని స్పష్టీకరణ! గురువారం... టి20 వరల్డ్‌కప్‌ తర్వాత కెపె్టన్‌గా ఉండనని కోహ్లి మనసులో మాటను వెల్లడించగా, గత ఆరు నెలలుగా దీనిపై తాము చర్చిస్తున్నామని బోర్డు ప్రకటన!

మొత్తంగా సారథి హోదాలో తన తొలి టి20 ప్రపంచకప్‌ తర్వాత ఆ బాధ్యతల నుంచే దూరమయ్యేందుకు విరాట్‌ నిర్ణయించుకున్నాడు. ధోని రాజీనామాతో జనవరి 26, 2017న తొలిసారి టి20 మ్యాచ్‌లో భారత్‌కు కోహ్లి కెపె్టన్‌గా వ్యవహరించగా... ఇప్పటి వరకు తన 90 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సగం మ్యాచ్‌లు (45) అతను సారథిగా మైదానంలోకి దిగాడు.
చదవండి: అంతా గంభీర్‌ భయ్యా వల్లే.. లేదంటే రోడ్డు మీద పానీపూరీ అమ్ముకునేవాడిని

సరైన నిర్ణయమేనా!  
కోహ్లి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు భారత్‌ 67 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 22 మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతను మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ 45 మ్యాచ్‌లే ఆడాడు. కాబట్టి పని భారం అనలేం! కోహ్లి స్థాయి ఆటగాడు ఇకపై ఏడాదికి 10–12 మ్యాచ్‌లలో నాయకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటే పెద్ద తేడా ఏముంటుంది. 45 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తే 27 గెలిచి, 14 ఓడిపోగా, మరో 2 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. ఇది మెరుగైన రికార్డే. పైగా ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో టి20 సిరీస్‌లు గెలిచిన ఏకైక ఆసియా కెపె్టన్‌గా ఘనత. కాబట్టి కెపె్టన్‌గా విఫలమయ్యాడని చెప్పలేం! 2017 నుంచి ఓవరాల్‌గా చూస్తే టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో (1,502) ఉన్నాడు.

ఎంతో మంది రోహిత్‌ అద్భుతం అని చెబుతున్నా... ఈ కాలంలో రోహిత్‌తో పోలిస్తే 5 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి కూడా అతనికంటే (1,500) రెండు పరుగులు ఎక్కువే చేశాడు. అంటే సారథ్యంలోనూ బ్యాట్స్‌మన్‌గా సూపర్‌ సక్సెస్‌! మరి తప్పుకోవడానికి బలమైన కారణం ఏమిటి? పైగా భారత జట్టు నాయకత్వానికి సంబంధించి ఆరు నెలలుగా తమ మధ్య చర్చలు సాగుతున్నాయని జై షా చెప్పడం మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించింది. అంటే ఇదేమీ కోహ్లి అనూహ్య నిర్ణయం కాదని అనిపిస్తోంది. గణాంకాల లోతుల్లోకి వెళ్లకుండా సగటు అభిమాని కోణంలో చూస్తే టి20లకు రోహిత్‌ సరైన కెప్టెన్‌ అనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. చదవండి: టి20 ప్రపంచకప్‌ తర్వాత టీమిండియాకు కొత్త కోచ్‌!

ముఖ్యం గా ఐపీఎల్‌ ప్రదర్శన ఇద్దరి మధ్య నాయకత్వ అంతరాన్ని బాగా చూపించింది. రోహిత్‌ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ ఐదుసార్లు విజేతగా నిలిస్తే... 2011 సీజన్‌ నుంచి కెప్టెన్‌గా ఉన్నా కోహ్లి ఒక్కసారి కూడా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు టైటిల్‌ అందించలేకపోయాడు. దాంతో భారత జట్టు టి20 మ్యాచ్‌లు ఆడిన ప్రతీ సందర్భంలో పోలిక మొదలైంది.

కోహ్లి గైర్హాజరులో రోహిత్‌ కెప్టెన్సీలో 19 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ 15 గెలిచి, 4 ఓడింది. అతని సారథ్యానికి ప్రశంసలు కూడా దక్కాయి. ఈ నేపథ్యంలో మరింత చర్చలకు అవకాశం ఇవ్వకుండా కెపె్టన్సీ విషయంలో కొంత ఉపశమనం పొందాలని కోహ్లి భావించి ఉంటాడు. అందుకే అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ప్రకటన సమయం మాత్రం సరైంది కాదు. గెలిచినా, ఓడినా వరల్డ్‌కప్‌ తర్వాతే దీని గురించి చెప్పి ఉంటే మెరుగ్గా ఉండేది! 

భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా నాయకత్వం కూడా వహించే అదృష్టం నాకు దక్కింది. సారథిగా ఉన్న నాకు ఈ ప్రయాణంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్‌ కమిటీ, కోచ్‌లతో పాటు జట్టు గెలవాలని కోరుకున్న ప్రతీ భారతీయుడికి నా కృతజ్ఞతలు. గత 8–9 ఏళ్లుగా మూడు ఫార్మాట్‌లలో ఆడుతూ 5–6 ఏళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నాపై తీవ్ర పనిభారం ఉంది. దీనిని అర్థం చేసుకోవడం అవసరం. భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌గా నా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించేందుకు నాకు కొంత ఉపశమనం అవసరం. సారథిగా జట్టుకు నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన నేను, ఇకపై టి20 బ్యాట్స్‌మన్‌గా కూడా అదే తరహాలో శ్రమిస్తాను. ఈ నిర్ణయం తీసుకునేందుకు నాకు చాలా సమయం పట్టింది. మున్ముందూ భారత జట్టుకు నా సేవలు అందిస్తూనే ఉంటాను.  
 –కోహ్లి   

మరిన్ని వార్తలు