ధోనిపై ఒత్తిడి ఎంత‌ ఉందో అప్పుడే తెలిసింది

29 Jul, 2020 19:58 IST|Sakshi

ఢిల్లీ : ఒక‌వైపు కెప్టెన్‌గా ప‌నిచేస్తూనే మరొక‌వైపు వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డమ‌నేది ఎంత క‌ష్టంగా ఉంటుందో తాను స్వ‌యంగా చూశానంటూ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. 2015లో  బంగ్లాదేశ్‌తో జ‌రిగిన ఒక వ‌న్డే మ్యాచ్‌లో  అప్ప‌టి కెప్టెన్ ఎంఎస్ ధోని స్థానంలో కోహ్లి ఒక ఓవ‌ర్ పాటు వికెట్ కీప‌ర్‌గా ప‌నిచేశాడు. ఆ స‌మ‌యంలో ఫీల్డింగ్ కూడా సెట్ చేశాడు. అయితే వికెట్ కీపింగ్‌తో పాటు ఫీల్డింగ్‌పై కూడా ఫోక‌స్ పెట్ట‌డం ఎంత క‌ష్ట‌మో అప్పుడు తెలిసొచ్చిందంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు. మ‌యాంక్ అగర్వాల్ నిర్వ‌హిస్తున్న ఓపెన్ నెట్స్ విత్ మ‌యాంక్ చాట్‌షోలో పాల్గొన్న కోహ్లి ఆరోజు మ్యాచ్‌లో జ‌రిగిన  ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. 
(బ్రాడ్‌ను మ‌న‌స్పూర్తిగా అభినందించండి: యూవీ)

'బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న వ‌న్డేలో 44వ‌ ఓవ‌ర్‌లో ధోని నా ద‌గ్గ‌రకు వ‌చ్చాడు. తాను రెస్ట్ రూమ్‌కు వెళ్తాన‌ని రెండు- మూడు ఓవ‌ర్ల పాటు వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని చెప్పాడు. మా జ‌ట్టుకు నాయ‌క‌త్వ స్థానంలో ఉన్న‌ ధోని మాట‌ను అంగీక‌రించి కీపింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టాను. 44వ ‌ఓవ‌ర్‌లో బ‌య‌ట‌కు వెళ్లిన ధోని 45వ‌‌ ఓవ‌ర్ పూర్తి కాగానే తిరిగి వ‌చ్చాడు. కానీ నేను కీపింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆ ఒక్క ఓవ‌ర్ నాకు చాలా క‌ష్టంగా అనిపించింది. ఎందుకంటే ఒక‌వైపు కీపింగ్ చేస్తూనే ఫీల్డింగ్‌తో పాటు బౌల‌ర్ వేస్తున్న బంతిని గ‌మ‌నించాలి. నిజంగా ఇది చాలా క‌ష్టం. అప్ప‌డు అర్థ‌మ‌యింది.. వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు ఎంత‌ క‌ష్టంగా ఉంటాయో.. పైగా ధోని కెప్టెన్‌గా ఉండ‌డంతో అటు కీపింగ్ చేస్తూనే ఫీల్డింగ్‌పై కూడా ఫోక‌స్ పెట్టేవాడు.'అంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు. (21 ఏళ్లు క్రికెట్‌ను మోశాడు.. అందుకే ఎత్తుకున్నాం)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా