Virat kohli: కోహ్లి 10th క్లాస్​మార్క్స్ లిస్ట్‌ వైరల్​.. వామ్మో ఇన్ని మార్కులా!

30 Mar, 2023 20:25 IST|Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌, ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి.. ప్రస్తుతం ఐపీఎల్‌-2022 సీజన్‌ కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన విరాట్‌, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతున్నాడు. కాగా వరుసగా 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌ తొలి సీజన్‌ నుంచి ఆర్సీబీ తరపున విరాట్‌ ఆడుతున్నాడు.

ఇప్పటివరకు ఆర్సీబీ తరపున 223 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 6624 పరుగులతో ఐపీఎల్‌ టాప్‌ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కింగ్‌ కోహ్లి.. తాజాగా ఎవరూ ఊహించని ఫోటోను షేర్‌ చేశాడు.

విరాట్‌  తన 10వ తరగతి మార్క్‌షీట్‌కి సంబంధించిన ఫోటోను 'కూ' యాప్‌లో షేర్‌ చేశాడు. "మార్క్స్‌‌షీట్‌లో ఏయే అంశాల్లో తక్కువ మార్క్‌లు వస్తాయో అవే మన వ్యక్తిగత జీవితాన్ని నిర్ణయించడానికి ఎ‍క్కువ ప్రాధాన్యం అవడం హాస్యాస్పదం అనిపిస్తుంది అని"కోహ్లి క్యాప్షన్‌గా ఇచ్చాడు. కాగా కింగ్‌ కోహ్లి తన 10వ తరగతిని 2004లో పూర్తి చేశాడు.

ఇక విరాట్‌కు తన 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయో ఓ లూక్కేద్దం. కోహ్లీ ఇంగ్లీష్‌లో 83, హిందీలో 75, గణితంలో 51, సైన్స్ & టెక్నాలజీలో 55, సోషల్ సైన్స్‌లో 81, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 74 మార్కులు సాధించాడు.

అత్యధికంగా ఇంగ్లీష్‌లో 83 మార్క్‌లు వచ్చాయి. ఇక విరాట్‌ మార్క్‌షీట్‌పై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.  కొంతమంది కోహ్లి తెలివైన స్టూడెంట్‌ అని, మరి కొంత మంది మ్యాథ్స్‌లో కొంచెం వీక్‌గా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌!

మరిన్ని వార్తలు