కోహ్లి విచిత్ర భాష.. షాక్‌లో పాండ్యా, అక్షర్‌

26 Feb, 2021 19:42 IST|Sakshi

అహ్మదాబాద్‌: మొటేరా వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా విజయంలో లోకల్‌ స్టార్‌ అక్షర్‌ పటేల్‌ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తం 11 వికెట్లు తీసిన అక్షర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్‌.. మరో లోకల్‌ ఆటగాడు హార్దిక్‌ పాండ్యా అక్షర్‌కు కంగ్రాట్స్‌ చెబుతూ సరదాగా ఇంటర్య్వూ చేశాడు. అయితే వీరి ఇంటర్య్వూ సీరియస్‌గా సాగుతున్న వేళ విరాట్‌ కోహ్లి అక్కడికి వచ్చాడు.

అల్లరి చేయడంలో కోహ్లి అందరికంటే ముందు వరుసలో ఉంటాడు. మ్యాచ్‌ గెలిచామన్న ఆనందంతో మరింత జోష్‌లో ఉన్న కోహ్లిని హార్దిక్‌ 'వెల్‌కమ్‌ ఇండియన్‌ కెప్టెన్‌' అంటూ పరిచయం చేశాడు. అయితే హార్దిక్‌  ప్రశ్న అడిగేలోపే అతని చేతిలో నుంచి మైకు లాక్కొన్న కోహ్లి అక్షర్‌ను ఉద్ధేశించి గుజరాతీ భాషలో ఏదో అన్నాడు. దీంతో అక్షర్‌ నవ్వగా.. ఆశ్యర్య పోవడం హార్దిక్‌ వంతైంది.

అయితే వెంటనే తేరుకున్న హార్దిక్‌..'' కోహ్లి బహుశా గుజరాతీ భాష నేర్చుకుంటున్నాడు. అందుకే అప్పుడప్పుడు ఇలా గుజరాతీలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు'' అంటూ చమత్కరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పింక్‌ బాల్‌ టెస్టులో విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అర్హతకు మరింత దగ్గరైంది. టీమిండియా నాలుగో టెస్టు మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా.. లేక గెలిచినా డబ్య్లూటీసీ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. కాగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 4 నుంచి మొదలుకానుంది.
చదవండి: 'కోహ్లి మాటలు నాకు కోపం తెప్పించాయి'
అశ్విన్‌ 11వ సారి.. అక్షర్‌ రెండో బౌలర్‌గా

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు