మహేంద్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ.. రైనా ఎమోషనల్‌ ట్వీట్

7 Jul, 2021 20:15 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ 40వ పుట్టిన రోజు సందర్భంగా యావత్‌ క్రికెట్‌ ప్రపంచం శుభాకాంక్షలు తెలిపింది. ఐసీసీ మొదలుకొని బీసీసీఐ, పలు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు, దిగ్గజ ఆటగాళ్లు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అభిమానులు ఇలా దాదాపు ప్రతి ఒక్కరు ధోనీని పొగడ్తలతో ముంచెత్తుతూ బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. సోషల్‌ మీడియా వేదికగా వీరంతా ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతూ, క్రికెట్‌ దిగ్గజంతో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. 

A post shared by Virat Kohli (@virat.kohli)

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ధోనీకి విషెస్ చెప్తూ.. 2011 వన్డే ప్రపంచకప్ నాటి ఫొటోని షేర్ చేశాడు. ‘హ్యాపీ బర్త్‌డే కెప్టెన్’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. కాగా, 2017లో ధోనీ నుంచి పూర్తిస్థాయి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కోహ్లీ.. ధోనీ ఎప్పటికీ నా కెప్టెన్ అని పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. 

ఇక సచిన్‌ ట్వీట్‌ చేస్తూ.. నా సహచరుడు, నా కెప్టెన్‌, నా మిత్రుడు హ్యాపీ బర్త్‌డే మాహీ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. 

ధోనీ ఓ క్రికెట్‌ దిగ్గజం, భవిష్యత్తు తరాలకు ప్రేరణ.. అంటూ బీసీసీఐ విషెస్‌ చెప్పగా, కెప్టెన్‌ కూల్‌కు బర్త్‌డే విషెస్‌ అంటూ ఐసీసీ ట్వీటింది. 

ఇక ధోనీ ఐపీఎల్‌ జట్టైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్వీట్‌ చేస్తూ.. సూపర్‌ బర్త్‌డే టు నమ్మ తలా.. వన్‌, ద ఓన్లీ వన్‌ ఎంఎస్‌ ధోనీ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.  

నా సోదరుడు, నా ఫ్రెండ్‌, నా మెంటర్‌ ఎంఎస్‌డీకి పుట్టిన రోజు శుభాంకాంక్షలంటూ ధోనీ సీఎస్‌కే సహచరుడు సురేశ్‌ రైనా ట్వీట్‌ చేశాడు.

ఇలా ధోనీని విష్‌ చేసిన వారిలో రాజస్థాన్‌ రాయల్స్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ కైఫ్‌, అశ్విన్‌, హార్ధిక్‌ పాండ్యా, చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దిగ్గజ క్రికెటర్లు లక్ష్మణ్‌, సెహ్వాగ్‌, వసీం జాఫర్‌ తదితరులున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు