Virat Kohli Test Captaincy Retirement: విరాట్‌ కోహ్లి రిటైర్‌మెంట్‌.. స్పందించిన పుజారా

16 Jan, 2022 19:38 IST|Sakshi

టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి వైదొలగడంపై టీమిండియా బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజారా ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ఏడేళ్లపాటు సారథిగా సేవలు అందించి, జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టాడని ప్రశంసలు కురిపించాడు. అతని సేవలు మరింతకాలం పాటు జట్టుకు అవసరమని అన్నాడు. కోహ్లి విజయవంతమైన కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్నాడని పేర్కొంటూ అభినందనలు తెలిపాడు. సమర్థవంతమైన నాయకుడిగా జట్టుకు ఎనలేని సేవలు అందించడం గర్వించదగ్గ విషయమని పుజారా చెప్పుకొచ్చాడు.

కోహ్లి కెరీర్‌లో మరింత ఎదగాలని పుజారా ఆకాంక్షించాడు. ఇక ఇప్పటికే టీ20, వన్డే జట్ల నాయకత్వాన్ని వదులుకున్న కోహ్లి.. తనకెంతో ఇష్టమైన టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు అతను శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. భారత క్రికెట్‌ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లి కొనసాగాడు. ఎంఎస్‌ ధోని నుంచి సారథ్య బాధ్యతలు చేపట్టిన అతను 68 టెస్టులకు నాయకత్వం వహించాడు. వాటిల్లో భారత్‌ 40 మ్యాచుల్లో విజయం సాధించింది. 


(చదవండి: టెస్ట్‌ కెప్టెన్సీకి విరాట్‌ గుడ్‌బై.. అనుష్క ఎమోషనల్‌ పోస్ట్‌)

మరిన్ని వార్తలు