450వ మ్యాచ్‌.. కోహ్లి చెత్త రికార్డు

21 Jan, 2022 15:36 IST|Sakshi

మైల్‌స్టోన్‌ మ్యాచ్ అంటే ఒక బౌలర్‌ లేదా బ్యాట్స్‌మన్‌కు దానిని గొప్పగా మలుచుకోవాలని భావిస్తారు. కోహ్లి కూడా తన 450వ మ్యాచ్‌లో సూపర్‌గా ఆడాలనుకున్నాడు. కానీ అదృష్టం కలిసి రాలేదు. ఫలితంగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో విరాట్‌ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐదు బంతులాడిన కోహ్లి కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. కాగా వన్డేల్లో కోహ్లి డకౌట్‌ అవ్వడం ఇది 14వ సారి కాగా.. ఒక స్పిన్నర్‌ బౌలింగ్‌ డకౌట్‌ కావడం ఇదే తొలిసారి. తన 450వ మ్యాచ్‌లో కోహ్లి ఒక చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.

టీమిండియా తరపున వన్డే క్రికెట్‌లో అత్యధిక డకౌట్‌ల విషయంలో మాజీ క్రికెటర్లు రాహుల్‌ ద్రవిడ్‌, కపిల్‌ దేవ్‌లను కోహ్లి దాటేశాడు. కపిల్‌, ద్రవిడ్‌లు వన్డేల్లో 13సార్లు డకౌట్‌ కాగా.. తాజా ఔట్‌తో కోహ్లి వారిని దాటేసి 14 డకౌట్లతో రైనా, సెహ్వాగ్‌, జహీర్‌లతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. వీరికంటే ముందు సచిన్‌ టెండూల్కర్‌ (20 డకౌట్‌లు), జగవల్‌ శ్రీనాథ్‌ (19 డ​కౌట్‌లు), అనిల్‌ కుంబ్లే, యువరాజ్‌ సింగ్‌లు 18 డక్‌లతో, హర్భజన్‌ సింగ్‌ 17 డకౌట్లతో, గంగూలీ 16 డకౌట్లతో ఉన్నారు.

>
మరిన్ని వార్తలు