కోహ్లి చెత్త రికార్డు.. ధోనితో సమానంగా

5 Mar, 2021 13:35 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డులు సాధించడంలో ఎప్పుడు ముందుంటాడు. అయితే అవి చెత్త రికార్డులు కావచ్చు.. లేక మంచి రికార్డులు అయి ఉండొచ్చు. తాజాగా ఇంగ్లండ్‌తో జరగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అండర్సన్‌ బౌలింగ్‌లో ఆప్‌స్టంప్‌ అవతల వెళుతున్న బంతిని టచ్‌ చేయడంతో కీపర్‌ ఫోక్స్‌ క్యాచ్‌గా అందుకున్నాడు. తద్వారా డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లి మరో చెత్త రికార్డును నమోదు చేశాడు.

విరాట్ కోహ్లికి కెప్టెన్‌గా టెస్టుల్లో ఇది 8వ డ‌కౌట్‌. గ‌తంలో ఎంఎస్‌ ధో‌ని కూడా కెప్టెన్‌గా 8సార్లు డ‌కౌట‌య్యాడు. ఇప్పుడు కోహ్లి అత‌ని రికార్డును స‌మం చేశాడు. ఈ సిరీస్‌లో కోహ్లి డ‌కౌట్ కావ‌డం ఇది రెండోసారి కావడం విశేషం.  టెస్టుల్లో బుమ్రా కూడా 9 సార్లు డకౌట్‌ కాగా.. ఓవరాల్‌గా చూసుకుంటే కోహ్లి 12 సార్లు డకౌట్‌ అయ్యాడు. అతని కంటే ముందు ఇషాంత్‌ శర్మ టెస్టుల్లో 32 డకౌట్లతో టాప్‌లో ఉన్నాడు.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. ప్రస్తుతం టీమిండియా 5వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. రిషబ్‌ పంత్‌ 22 పరుగులు, అశ్విన్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 49 పరుగుల వద్ద ఔట్‌ ఒక్క పరుగు తేడాతో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. అంతకముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్‌ అయింది.

చదవండి: 
రూల్స్‌ పక్కన పెట్టండి, నచ్చింది చేయండి: జడేజా
గిల్‌ ఇలాగే ఆడావో.. రాహుల్‌, అగర్వాల్‌ వచ్చేస్తారు!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు