కోహ్లికి కలిసిరాని బంగ్లాదేశ్‌ సిరీస్‌.. అన్నింటా ఫెయిల్‌

24 Dec, 2022 22:12 IST|Sakshi

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లికి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఏమాత్రం కలిసి రాలేదు. రెండు టెస్టులు కలిపి పట్టుమని వంద పరుగులు కూడా చేయలేకపోయాడు. అంతేకాదు ఎప్పుడు ఫీల్డింగ్‌లో మెరిసే కోహ్లి ఈసారి మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 3 క్యాచులను జారవిడిచాడు. అంతకుముందు తొలి టెస్టులోనూ ఓ క్యాచ్ మిస్ చేశాడు. ఇలా అన్నింటి ఫెయిల్‌ అయిన కోహ్లి మరో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. 

బంగ్లా టూర్‌లో ఫెయిల్యూర్‌తో విరాట్ కోహ్లీ టెస్టు సగటు 48.90కి పడిపోయింది. దాదారు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా విరాట్ కోహ్లీ టెస్టు సగటు 49 కంటే తక్కువకి పడిపోయింది. 2020లో న్యూజిలాండ్ పర్యటనలో 38 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇక బంగ్లా టూర్‌లో  రెండు టెస్టులు కలిపి 45 పరుగులు చేసి చెత్త రికార్డు నెలకొల్పాడు.2020 ఏడాదిలో కరోనా కారణంగా టీమిండియా నాలుగు టెస్టులు మాత్రమే ఆడింది. ఆ ఏడాది విరాట్ టెస్టు సగటు 19.33 ఉండగా, గత ఏడాది కాస్త పెరిగి 28.21గా నమోదైంది. ఈ ఏడాది విరాట్ కోహ్లీ టెస్టు సగటు మళ్లీ పడిపోయింది. ఈ ఏడాది విరాట్ కోహ్లీ 26.50 సగటుతో టెస్టుల్లో పరుగులు చేశాడు. 

ఇక కోహ్లి గత పది ఇన్నింగ్స్‌లు చూసుకుంటే వరుసగా 1, 24, 19*, 1, 20, 11, 13, 23, 45, 29 పరుగులు చేశాడు. మొత్తంగా పది ఇన్నింగ్స్‌లు కలిపి 18 సగటుతో 181 పరుగులు మాత్రమే చేశాడు. గత పది ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ కాదు కదా కనీసం హాఫ్‌ సెంచరీ మార్క్ కూడా అందుకోలేకపోయాడు. 

చదవండి: మెస్సీ ధరించిన నల్లకోటు ధర ఎంతంటే?

'మానసిక వేదనకు గురయ్యా'.. సొంత బోర్డుపై ఆగ్రహం

మరిన్ని వార్తలు