Ind Vs SL 2nd Test: అయ్యో మా గుండె పగిలింది కోహ్లి! నా పరిస్థితీ అదే ఇక్కడ .. ఏం చెప్పను!

12 Mar, 2022 19:09 IST|Sakshi

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న పింక్‌ బాల్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి నిరాశపరిచాడు. 48 బంతుల్లో  కేవలం 23 పరుగుల మాత్రమే చేసి కోహ్లి పెవిలియన్‌కు చేరాడు. ఇక భారత ఇన్నింగ్స్‌ 23 ఓవర్‌ వేసిన ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో.. కోహ్లి డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఒక్క సారిగా టర్న్‌ అయ్యి బ్యాట్‌కు తగలకుండా అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో లంక ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్‌ చేశారు.

వెంటనే ఆన్-ఫీల్డ్ అంపైర్ వేలు పైకెత్తాడు. కాగా కోహ్లి తను ఔట్‌గా భావించి రివ్యూ అవకాశం ఉన్న తీసుకోలేదు. అయితే ఔటయ్యాక కోహ్లి ముఖం ఒక్క సారిగా మారిపోయింది. బాధపడుతూ కోహ్లి క్రీజులో కొద్ది సేపు టీమిండియా అలా ఉండిపోయాడు. అనంతరం నిరాశగా పెవిలియ్‌నకు కోహ్లి చేరాడు. కాగా కోహ్లి లూక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నెటిజన్లు కోహ్లి​కు మద్దతుగా నిలుస్తోన్నారు. "అయ్యో మా గుండె పగిలింది కోహ్లి.. బంతి అలా టర్న్‌ అవుతుందని అసలు ఊహించలేదు" అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

ఇక భారత తొలి ఇన్నిం‍గ్స్‌లో 252 పరుగులకి ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌(92) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు. భారత బ్యాటర్లలో పంత్‌(39),విహారి(31),కోహ్లి(23) పరుగులు సాధించారు.శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దేనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ధనంజయ డి సిల్వా రెండు వికెట్లు, లక్మల్ ఒక వికెట్‌ సాధించాడు.

చదవండి: IND VS SL 2nd Test Day 1: శ్రేయస్‌ ఒంటరి పోరాటం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ 

మరిన్ని వార్తలు