కోహ్లి.. ఎగ్జామ్‌లో తేలిపోయావ్‌!

25 Sep, 2020 16:57 IST|Sakshi

దుబాయ్‌: గత కొన్ని సీజన్ల నుంచి చూస్తే విరాట్‌ కోహ్లికి ఐపీఎల్‌ కలిసి రానట్లే ఉంది.  కోహ్లి ఐపీఎల్‌లో ఆకట్టుకోవడం అనేది పక్కన పెడితే ఎప్పుడూ ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌కు గురైన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్‌ ప్రారంభం అయ్యిందో లేదో కోహ్లి అప్పుడే ఫ్యాన్స్‌కు దొరికేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గెలవడంతో కోహ్లిపై పెద్దగా విమర్శలు రాకపోయినా, కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓడిపోవడం మాత్రం మనోడికి కంటిమీద కునిలేకుండా చేసి ఉంటుంది. ప్రధానంగా రాహుల్‌ ఇచ్చిన రెండు క్యాచ్‌లను విడిచేయడం  కోహ్లి పీడకలలా మారి ఉంటుంది. బాగా జిగిరి దోస్త్‌ అని రాహుల్‌కు లైఫ్‌లు ఇచ్చి మరీ శతకం పూర్తి చేయించాడంటూ ఫ్యాన్స్‌ ఉతికి ఆరేస్తున్నారు.(చదవండి: ఈ ఏడాది మరీ ఇంత దారుణమా: అశ్విన్‌)

కోహ్లి ఫీల్డింగ్‌ వైఫల్యాన్ని టార్గెట్‌ చేస్తూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.. మనోడో ప్రాక్టీస్‌లో ఇరగదీస్తాడు కానీ అసలు సిసలు పోరుకు వచ్చేసరికి తేలిపోతాడంటూ విమర్శిస్తున్నారు.  ‘నేను మొత్తం ఇయర్‌లో ఇంత ప్రాక్టీస్‌ చేశా.. కానీ ఎగ్జామ్‌లో మాత్రం తేలిపోయాను’ అని అర్థం వచ్చేలా ఒక అభిమాని సెటైర్‌ వేయగా, ‘ కొన్నిరోజుల క్రితం లంబర్‌ వన్‌ ఫీల్డర్‌ అని పోస్ట్‌ చేశావ్‌.. ఇదేనా ఆ లంబర్‌  వన్‌ ఫీల్డింగ్‌’ అని మరొకరు ఎద్దేవా చేశారు. ‘ రాహుల్‌ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోహ్లి వదిలేసినా అంతా ఉమేశ్‌ యాదవ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. ఎందుకంటే కోహ్లి ఒక సింపుల్‌ క్యాచ్‌ను వదిలేశాడు కదా.. అందుకు ఉమేశ్‌ యాదవ్‌ను విమర్శిస్తున్నారు’ అని మరొకరు మరో మీమ్‌ పోస్ట్‌ చేశారు. ఇలా కోహ్లిపై వరుసగా మీమ్స్‌ వర్షం కురస్తోంది. ఇటీవల కోహ్లి ప్రాక్టీస్‌లో మెరుపు ఫీల్డింగ్‌ చేసిన వీడియోను ఆర్సీబీ పోస్ట్‌ చేయడాన్నే అభిమానులు ఎత్తిచూపుతున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు