IPL 2022: 'వచ్చే సీజన్‌లో మళ్లీ  కలుద్దాం'.. విరాట్‌ కోహ్లి భావోద్వేగ ట్వీట్‌

28 May, 2022 20:25 IST|Sakshi
PC: IPL.COM

ఐపీఎల్‌-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రయాణం ముగిసింది. శుక్రవారం జరగిన క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి చెంది టోర్నీ నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది. ఈ సారైనా టైటిల్‌ నెగ్గుతుందని భావించిన ఆర్సీబీ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి భావోద్వేగ ట్వీట్‌ చేశాడు. ఈ సీజన్‌ అంతటా మద్దతుగా నిలిచిన మేనేజ్‌మెంట్‌కు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

"కొన్నిసార్లు మనం విజయం సాధిస్తాం, మరి కొన్ని సార్లు విజయం సాధించలేము. కానీ అభిమానులు మాత్రం నిరంతరం మాకు మద్దుతగా నిలిచారు. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీలో బాగమైన మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్, అభిమానుల అందరికీ నా ధన్యవాదాలు. వచ్చే సీజన్‌లో మళ్లీ  కలుద్దాం" అని కోహ్లి ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో కోహ్లి పేలవ ఫామ్‌ను కనబరిచాడు. 16 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 341 పరుగులు మాత్రమే చేశాడు.

చదవండి: RCB Tweet On RR: రాజస్తాన్‌కు ఆర్సీబీ విషెస్‌.. గుండెల్ని మెలిపెట్టే ట్వీట్‌! హృదయాలు గెలిచారు!

మరిన్ని వార్తలు