మా పాజీ తర్వాత మ్యాచ్ ఆడుతాడా!

9 Mar, 2021 11:08 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌  ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడంలో ఎప్పుడు ముందుంటాడు. మొన్నటికి మొన్న మెదుడు ఫోటో షేర్‌ చేసి ఇంగ్లండ్‌కు అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన సెహ్వాగ్‌ తాజాగా సచిన్‌కు సంబంధించి ఒక వీడియోను రిలీజ్‌ చేశాడు. ఆ వీడియోలో సచిన్‌ ఫిజియో పక్కన కూర్చొని తన మణికట్టు కింది భాగంలో సూదులు గుచ్చుకొని కనిపిస్తాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్‌.. ఫిజియోను ఉద్దేశించి '' సచిన్‌ పాజీ తర్వాతి మ్యాచ్‌ ఆడుతాడా'' అంటూ అడిగాడు.

దీనికి ఫిజియో... అవునన్నుట్లుగా తలూపాడు.. అయితే సచిన్‌ మాత్రం.. ఏదో ఇది చిన్న ప్రయత్నం మాత్రమే.. ఎందుకంత బాధపడుతున్నావు అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. దీంతో పక్కనే ఉన్న యువరాజ్‌ ..''నీకు ఇలానే కావాలి వీరు బాయ్‌'' అంటూ చమత్కరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రోడ్‌ సేఫ్టీ అవగాహనలో భాగంగా మాజీ క్రికెటర్లంతా కలిసి రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ20 పేరిట సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.  

సచిన్‌ కెప్టెన్సీలో సెహ్వాగ్‌, యువరాజ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌ సహా ఇతర ఆటగాళ్లు ఇండియా లెజెండ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 5న బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ 35 బంతుల్లోనే 80 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. 33 పరుగులతో సచిన్‌ అతనికి సహకరించాడు. కాగా ఇండియా లెజెండ్స్‌ తన తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ లెజెండ్స్‌ను ఎదుర్కోనుంది.
చదవండి:
వీరు విధ్వంసం.. 35 బంతుల్లో 80 పరుగులు

సచిన్‌ పాజీతో మళ్లీ బ్యాటింగ్‌.. సూపర్‌ ఇన్నింగ్స్‌!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు