Virender Sehwag: అతడిని టీ20 వరల్డ్ కప్ నుంచి ఎందుకు తప్పించారో తెలియదు!

27 Sep, 2021 13:40 IST|Sakshi

Virender Sehwag Comments On Yuzvendra Chahal Omission From T20 World Cup: ఐపీఎల్‌ 2021 సెకెండ్‌ ఫేజ్‌లో ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలంజర్స్‌ బెంగళూరు 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో ఆ జట్టు ఆఫ్‌ సిన్నర్‌ యజువేంద్ర చాహల్ మూడు కీలక వికెట్లు పడగొట్టి ముఖ్యమైన పాత్ర పోషించాడు.

ఈ క్రమంలో చాహల్‌ ప్రదర్శనపై భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. చాహల్‌ని స్మార్ట్ ఆటగాడని, బెంగళూరు జట్టుకు దొరికన ఆస్తి అని సెహ్వాగ్ కొనియాడాడు. కాగా టీ 20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన 15 మంది భారత  జట్టు సభ్యుల్లో చాహల్‌కు స్ధానం దక్కకపోవడంపై సెహ్వాగ్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.

 "చాహల్ గతంలో కూడా బాగా బౌలింగ్ చేశాడు. అతడిని టీ 20 ప్రపంచకప్ జట్టు నుంచి ఎందుకు తప్పించారో నాకు అర్థం కాలేదు. దీనిపై సెలెక్టర్లు వివరణ ఇవ్వాలి. శ్రీలంక పర్యటనలో  రాహుల్ చాహర్ కూడా ఆశించనంతగా రాణించలేదు. కానీ ప్రస్తుతం చాహల్ బౌలింగ్ చేస్తున్న తీరు అద్భుతంగా ఉంది. టీ20 క్రికెట్‌లో ఏ జట్టు కైనా ఒక ఆస్తిగా ఉంటాడు"అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా టీ 20 ప్రపంచకప్ కోసం స్పిన్నర్లు  రవి అశ్విన్, అక్షర్‌ పటేల్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ ఎంపిక చేసింది.

చదవండి: RCB vs MI: తండ్రి ఔట్‌ కావడంతో కుర్చీని లాగి కొట్టిన ఏబీడీ కొడుకు, షాక్‌కు గురైన తల్లి!

>
మరిన్ని వార్తలు