ధోనిపై ద్రవిడ్‌ ఆగ్రహం; మళ్లీ ఆ అవకాశం ఇవ్వలేను

12 Apr, 2021 11:33 IST|Sakshi

న్యూఢిల్లీ:  ‘ది వాల్’ గా పేరున్న భారత మాజీకెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వతహాగా మృదు స్వభావి. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆయన ప్రశాంతంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఓర్పు, సహనం ప్రదర్శించి మిస్టర్‌ కూల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నట్టుగా వ్యవహరిస్తాడు. అయితే ఈ మిస్టర్‌ కూల్‌కు ధోనిపై ఓ సందర్భంలో విపరీతమైన కోపం వచ్చిందట. ఈ విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పాడు.

ఇటీవల ద్రవిడ్‌ ఓ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ఈ మిస్టర్‌ డిపెండబుల్‌‌ కోపంతో ఊగిపోతూ కనిపిస్తుంటాడు. ప్రస్తుతం ఆ యాడ్‌ వీడియో‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో… నిజజీవితంలో ఎప్పుడైనా ద్రవిడ్‌ ఆగ్రహించాడా అని చాలా మందికి ఓ ప్రశ్న ఎందురైంది. ఈ సందర్భంగా సెహ్వాగ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ద్రవిడ్‌ ధోనిపై ఆగ్రహించిన విషయాన్ని గుర్తు చేశాడు.

2006లో పాకిస్థాన్‌తో వన్డే సిరిస్‌ సమయంలో ధోనీపై ద్రవిడ్‌ అరిచాడని పేర్కొన్నాడు. ‘ధోనీ ఓ మ్యాచ్‌లో పాయింట్‌ దిశలో షాట్‌ కొట్టి క్యాచ్‌ ఔటయ్యాడు. అప్పుడు ధోనీపై ద్రవిడ్‌ కోప్పడ్డాడు. అలాగేనా ఆడేది..? మ్యాచ్‌ను నువ్వే ముగించాల్సింది అంటూ అరిచాడని’ తెలిపాడు. ధోని-ద్రవిడ్‌ ఆంగ్ల సంభాషణలో తనకీ విషయాలు అర్థమయ్యాయని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తరువాతి మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అవతలి ఎండ్‌లో ఉన్న సెహ్వాగ్‌ వెళ్లి బౌండరీల కోసం ప్రయత్నించడం లేదని ధోనిని అడగాడట. అందుకు ధోని‌ ‘ద్రవిడ్ తనని మళ్ళీ తిట్టడం ఇష్టం లేదని, కనుక ఇన్నింగ్స్‌ను ముగించేవరకు తాను క్రీజ్‌లోనే కొనసాగాలనుకున్నట్లు’ తెలిపాడని ఈ సందర్భంగా సెహ్వాగ్ వెల్లడించారు.
( చదవండి: రాబోయే రోజుల్లో క్రికెట్‌లో మార్పులపై ద్రవిడ్‌ వ్యాఖ్యలు )

మరిన్ని వార్తలు