థర్డ్‌ అంపైర్‌ కళ్లకు గంతలు.. సెహ్వాగ్‌ ఫన్నీ ట్రోల్‌

19 Mar, 2021 10:26 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్ యాదవ్‌‌ వివాదాస్పద రీతిలో ఔటైన సంగతి తెలిసిందే. సూర్య కుమార్‌ ఔట్‌ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతను అవుట్‌ కాదని స్పష్టంగా తెలుస్తున్నా.. థర్డ్‌ అంపైర్‌‌ అవుట్‌ ఇయ్యడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. అయితే బంతిని అందుకున్న డేవిడ్‌ మలాన్‌పై విపరీతమైన మీమ్స్‌,ట్రోల్స్‌ వస్తున్నాయి. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా సూర్య కుమార్‌ ఔట్‌పై స్పందించాడు.

వీరు షేర్‌ చేసిన ఫోటోలో కళ్లకు గంతలు కట్టుకున్న నిలబడి ఉన్న కుర్రాడు .. మరోపక్కన డేవిడ్‌ మలాన్‌ క్యాచ్‌ అందుకున్న ఫోటోను పెట్టాడు.  సూర్య కుమార్‌ ఔట్‌ గురించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో థర్డ్‌ అంపైర్‌ కళ్లకు గంతలు కట్టుకొని రిప్లైని చూశాడు.అందుకే అతనికి సూర్య ఔట్‌ అయినట్లు కనపడింది. ఇది చీటింగ్‌ అంటూ కామెంట్‌ చేశాడు. సెహ్వాగ్‌ ట్వీట్‌ ప్రస్తుతం నవ్వులు పూయిస్తుంది. అంతకముందు కోహ్లి కూడా సూర్యకుమార్‌ అవుట్‌పై నిరసన వ్యక్తం చేశాడు. రిప్లైలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించినా అంపైర్‌ అవుటివ్వడంపై కోహ్లి ఆశ్చర్యపోయాడు.

ఇక అసలు విషయంలోకి వెళితే.. స్యామ్‌ కరన్‌ వేసిన 14వ ఓవర్‌ తొలి బంతిని స్వీప్‌షాట్‌తో లెగ్‌సైడ్‌ సిక్సర్‌ బాదిన యాదవ్‌ తర్వాత బంతిని అలాగే ఆడాడు. కానీ ఫైన్‌లెగ్‌లో మలాన్‌ క్యాచ్‌పట్టాడు. అయితే బంతి అతని చేతుల్లో పడీపడగానే నేలనీ తాకింది. టీవీ అంపైర్‌ పలుమార్లు రీప్లే చేసి నిమిషాలపాటు చూసి ఫీల్డ్‌ అంపైర్‌ ఇచ్చిన ‘సాఫ్ట్‌ సిగ్నల్‌ అవుట్‌’కే మొగ్గుచూపడంతో సూర్యకుమార్‌ క్రీజు వీడాడు. ఇక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. సూర్య కుమార్‌ 57, పంత్‌ 30, అయ్యర్‌ 37 పరుగులతో రాణించారు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కాగా ఇరు జట్లకు కీలకంగా మారిన ఐదో టీ20 రేపు జరగనుంది.
చదవండి:
ఇంగ్లండ్‌ తొండి.. సూర్య ఔట్‌ కాదు

>
మరిన్ని వార్తలు