Pro Kabaddi: రికార్డులు బ్రేక్‌.. ఊహించని ధర పలికిన కబడ్డీ స్టార్‌ ప్లేయర్స్‌

6 Aug, 2022 23:17 IST|Sakshi

Pro Kabaddi.. దేశంలో క్రికెట్‌తో పాటుగా కబడ్డీకి సైతం క్రేజ్‌ ఉంది. ఇండియాలో ఐపీఎల్‌ తర్వాత ప్రో కబడ్డీకి(Pro Kabbadi)కి కూడా ఎంతో ఆదరణ కనిపించింది. కబడ్డి ఫ్యాన్స్‌ను అలరిస్తూ ప్రో కబడ్డీ ఇప్పటికి 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రో కబడ్డీ 9వ సీజన్‌ కూడా ప్రారంభం కానుంది.

అయితే, 9వ సీజన్‌కు ముందు ప్రో​ కబడ్డీకి భారీ వేలం జరిగింది. ముంబై వేదికగా రెండు రోజులపాటు(ఆగస్టు5, 6 తేదీల్లో) జరిగిన మెగా వేలంలో కబడ్డీ స్టార్‌ ప్లేయర్స్‌ ఊహించని ధర పలికారు. వేలంలో రికార్డు ధరకు ప్లేయర్స్‌ను ప్రాంచైజీలు దక్కించుకున్నాయి. మొత్తంగా 12 టీమ్స్‌ 500 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేయడానికి పోటీపడ్డాయి.

కాగా, ఈ మెగా వేలంలో రికార్డు స్థాయిలో పవన్‌ షెరావత్‌ను రూ.2.65కోట్లకు తమిళ్‌ తలైవాస్‌ దక్కించుకోగా.. వికాస్‌ ఖండోలాను రూ.1.70కోట్లకు బెంగళూరు బుల్స్‌ కొనుగోలు చేసింది. ఇక, ఫజల్‌ అట్రాసలిని పూణేరి పల్టన్స్‌.. రూ. 1. 38కోట్లకు దక్కించుకుంది. గుమాన్‌ సింగ్‌ను రూ. 1.21కోట్లకు యు ముంబా కొనుగోలు చేసింది.  మరోవైపు.. ప్రొ కబడ్డీలో రికార్డు బ్రేకర్‌గా పేరొందిన ప్రదీప్‌ నర్వాల్‌ను రూ.90 లక్షలకు యూపీ యోధా ఎఫ్‌బీఎంలో దక్కించుకుంది. ప్రొ కబడ్డీ చరిత్రలోనే పవన్‌ షెరావత్‌.. భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఇక హర్యానా స్టీలర్‌ రూ.65.10లక్షలకు అమీర్‌ హొసైన్‌ను, రవికుమార్‌ను రూ.64.10లక్షలకు(దబాంగ్‌ ఢిల్లీ), నీరజ్‌ నర్వాల్‌ను బెంగళూరు బుల్స్‌ రూ.43లక్షలకు కొనుగోలు చేసు​కున్నాయి. 

ఇక, తెలుగు టైటాన్స్‌ విషయానికి వస్తే.. రజనీష్‌, అంకిత్‌ బెనివల్‌ను రీటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా అభిషేక్‌ సింగ్‌, మోను గోయల్‌,పర్వేష్‌ భైంస్వాల్‌, సుర్జీత్‌ సింగ్‌, విశాల్‌ భరద్వాజ్‌, సిద్దార్ధ్‌ దేశాయ్‌ను కొనుగోలు చేశారు. కాగా, రాహుల్‌ చౌదరిని కనీస ధర రూ.10లక్షలకు జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. దబాంగ్‌ ఢిల్లీ నవీన్‌ కుమార్‌, విజయ్‌ను రీటైన్‌ చేసుకుంది. 

ఇది కూడా చదవండి: సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు..

మరిన్ని వార్తలు