ద్రవిడ్‌..నీకు నువ్వే సాటి!

11 Jan, 2021 13:18 IST|Sakshi

న్యూఢిల్లీ: రాహుల్ ద్రవిడ్... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు ది వాల్, మిస్టర్ డిపెండబుల్. భారత క్రికెట్‌కు దొరికిన అరుదైన బ్యాట్స్‌మన్‌. టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ పది వేల పరుగుల మైలురాయిని సాధించిన బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్.  అతని గొప్పతనం అంతా అతడి టెక్నిక్‌లోనే ఉంది. టెక్నిక్ ఉంటే చాలు.. ఏ ఫార్మాట్ అయినా ఒకేలా ఆడగలరు అని నిరూపించాడు రాహుల్‌ ద్రవిడ్.  52.31 యావరేజితో రాహుల్ ద్రవిడ్ 13,288 పరుగులు చేశాడు. మోడ్రన్‌ డే క్రికెట్‌లో ద్రవిడ్‌ నమోదు చేసిన టెస్టు యావరేజ్‌ సైతం ఒక అత్యుత్తమ సగటుగా నిలవడం మరో విశేషం.
 
ద్రవిడ్ టీమిండియా కెప్టెన్‌గా కూడా వ్యహరించాడు. 2012లో రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఐఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 89 మ్యాచ్‌లు ఆడిన ద్రవిడ్.. 2013 తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత అండర్-19, భారత్-ఎ జట్లకు ఆయన చీఫ్ కోచ్‌గా వ్యవహరించాడు.  ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. 2017లో ద్రవిడ్‌కు టీమిండియా హెడ్‌ కోచ్‌గా వ్యవహరించే  ఆఫర్‌ వచ్చినప్పటికీ అండర్‌-19 స్థాయిలో కోచింగ్‌కే మొగ్గుచూపడం అతనిలోని నిస్వార్థ సేవలకు నిదర్శనం. భారత్‌ తరఫున ఎన్నో స్పెషల్‌ ఇన్నింగ్స్‌లు ఆడిన ద్రవిడ్‌.. ఎప్పటికీ స్పెషలే. ఈ రోజు 48వ ఒడిలోకి అడుగుపెడుతున్న  ద్రవిడ్‌ను మరొకసారి గుర్తుచేసుకుందాం. 

ద్రవిడ్‌ ఘనతల్లో కొన్ని..

  • 2004లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌
  • 2004లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్‌ అవార్డులు
  • 2018లో ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు
  • 509 ఇంటర్నేషనల్‌ క్యాప్స్‌
  • 24,208 అంతర్జాతీయ పరుగులు
  • 48 అంతర్జాతీయ సెంచరీలు(36టెస్టు సెంచరీలు, 12 వన్డే సెంచరీలు)
  • టెస్టుల్లో అత్యధికంగా 210 క్యాచ్‌లు
  • వన్డే,టెస్టుల్లో 10వేల పరుగులు చేసిన అరుదైన ఆటగాడు
మరిన్ని వార్తలు