Asia Cup 2022: 'ఆఫ్రిదికి అంత సీన్‌ లేదు.. దమ్ముంటే గెలిచి చూపించండి'

21 Aug, 2022 09:35 IST|Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా ఆఫ్రిది గాయం కారణంగా ఆసియాకప్‌-2022కు దూరమైన సంగతి తెలిసిందే. టోర్నీ మొత్తం​ విషయం పక్కన పెడితే భారత్‌తో మ్యాచ్‌కు ఆఫ్రిది దూరం కావడం పాక్‌కు గట్టి ఎదరుదెబ్బ అనే చేప్పుకోవాలి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ వకార్ యూనిస్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆసియా కప్ నుంచి ఆఫ్రిది తప్పుకోవడంతో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఊపిరి  పీల్చుకోనున్నారని యూనిస్ అభిప్రాయడ్డాడు.

కాగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్‌ విజయం సాధించడంలో షాహీన్ షా కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి వంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపి షాహీన్‌ దెబ్బ కొట్టాడు. ఆ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన గాను ఆఫ్రిదికి మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

షహీన్ దూరం కావడం భారత బ్యాటర్లకు బిగ్‌ రిలీఫ్‌
"షహీన్ గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరం కావడం భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు పెద్ద ఉపశమనం. అతడు  ఆసియా కప్‌లో భాగం కాకపోవడం పాక్‌కు గట్టి ఎదురు దెబ్బ. అతడు త్వరగా కోలుకుని తిరిగి జట్టులోకి చేరుతాడని ఆశిస్తున్నా" అంటూ యూనిస్‌ ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌ చేసిన యూనిస్‌ను భారత అభిమానులు ట్విటర్‌లో ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

"ఆఫ్రిదికి అంత సీన్‌ లేదు, ముందు ఆసియాకప్‌లో గెలిచి చూపించండి" అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా కప్‌ యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. కాగా భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆగస్టు 28న దుబాయ్‌ వేదికగా తలపడనుంది.

ఆసియా కప్‌కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్, అవేష్ ఖాన్

ఆసియా కప్‌కు పాక్‌ జట్టు
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ  ఉస్మాన్ ఖదీర్


చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. ఎప్పుడంటే?

మరిన్ని వార్తలు