వార్విక్‌షైర్‌ జట్టుకు ఆడనున్న కృనాల్‌ పాండ్యా

2 Jul, 2022 05:13 IST|Sakshi

ఇంగ్లండ్‌ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ రాయల్‌ లండన్‌ కప్‌లో భారత క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యా బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 2 నుంచి 23 వరకు జరిగే ఈ టోర్నీలో కృనాల్‌ వార్విక్‌షైర్‌ కౌంటీ జట్టు తరఫున ఆడనున్నాడు.

31 ఏళ్ల కృనాల్‌ భారత్‌ తరఫున ఐదు వన్డేలు, 19 టి20 మ్యాచ్‌లు ఆడాడు. గత ఏడాది వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన కృనాల్‌ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి అరంగేట్రంలో వేగంగా హాఫ్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

మరిన్ని వార్తలు