'వాళ్లను చూస్తే 90లలో మమ్మల్ని చూసినట్లుంది'

7 Nov, 2020 16:06 IST|Sakshi

యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌ చివరి అంకానికి చేరింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ ఆరవసారి ఫైనల్లో అడుగుపెట్టగా.. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆర్‌సీబీపై గెలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో తలపడనుంది. ఐపీఎల్‌ తర్వాత కోహ్లి నేతృత్వంలోని టీమిండియా జట్టు నేరుగా ఆసీస్‌ పర్యటనకు బయలుదేరనుంది. మొత్తం రెండు నెలల పాటు కొనసాగనున్న సిరీస్‌లో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. కాగా నవంబర్‌ 27 నుంచి టెస్టు సిరీస్‌ మొదలవనుండగా.. ఇందులో అడిలైడ్‌ వేదికగా డే- నైట్‌ టెస్టు కూడా ఉంది. (చదవండి : అగస్త్యను చాలా మిస్సవుతున్నా : హార్దిక్‌)

ఈ సందర్భంగా పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ టీమిండియా ఆటతీరుపై యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. ' ఈసారి సిరీస్‌కు ఆసీస్‌ జట్టుకు ప్రపంచలోననే అత్యుత్తమ బౌలర్లు కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నా. పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజల్‌వుడ్‌లతో ఆసీస్‌ బౌలింగ్‌ పటిష్టంగా కనిపిస్తుంది. వాళ్లు ఉపయోగించే కూకాబుర్ర బంతిని ఉపయోగించే పద్దతులను ఎదుర్కొనే సత్తా కష్టమే అని చెప్పొచ్చు. (చదవండి : ఆర్సీబీ ఔట్‌.. కోహ్లి ఎమోషనల్‌ ట్వీట్‌!)

స్వదేశంలో ఆసీస్‌ జట్టు ఫేవరెట్‌ కావొచ్చు.. కానీ టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. అందులోనూ బుమ్రా లాంటి ప్రపంచస్థాయి నెంబర్‌ వన్‌ బౌలర్‌ ఆసీస్‌ గడ్డపై కీలకం కానున్నాడు. ఒక్క బుమ్రా అనే కాదు.. షమీ, ఇషాంత్‌ లాంటి ఆటగాళ్లు గంటకు 140-150 కిమీ వేగంతో బంతులు విసురుతూ వికెట్లను తీస్తున్నారు. ఇక టీమిండియా బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్‌ బ్యాట్స్‌మెన్‌ టీమిండియాలోనే ఎక్కువగా కనిపిస్తారు. ‌అందుకే నాకు ఇప్పుడు టీమిండియా కొత్తగా కనబడుతుంది.

టీమిండియా వాళ్ల ఆటతీరుతో పాటు శైలిని మార్చుకున్న తీరును చూస్తుంటే.. 90వ దశకంలో మా జట్టును గుర్తుకు తెస్తుంది. ఎందుకంటే 90వ దశకంలో నేను, వకార్‌ యూనిస్‌, ఇమ్రాన్‌ ఖాన్‌లాంటి ప్రపంచస్థాయి పేస్‌ బౌలర్లతో ఉండేవాళ్లం. ఇప్పుడు టీమిండియా పేస్‌  బౌలింగ్‌ విభాగం కూడా అలాగే కనిపిస్తుంది. టీమిండియా ఆటగాళ్లు కాస్త వంకరగా తయారయ్యారంటూ' అంటూ అక్రమ్ నవ్వుతూ‌ చెప్పుకొచ్చాడు. కాగా 2018-19 బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపిని టీమిండియా నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు