Rohit-Kohli: 'ఇద్దరు చెత్తగా ఆడుతున్నారు.. ఈరోజైనా కనికరిస్తారా!

30 Apr, 2022 15:26 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో భాగంగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఘోరంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఆర్‌సీబీ తరపున కోహ్లి 9 మ్యాచ్‌ల్లో 128 పరుగులు చేయగా.. అటు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ 8 మ్యాచ్‌ల్లో 153 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరు తమ ఫేలవ ఫామ్‌తో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాగా శనివారం డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

తొలుత గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్‌సీబీ అమీతుమీ తేల్చుకోనుండగా.. రాత్రి రాజస్తాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌  జరగనుంది. కనీసం ఈరోజైనా తాము ఆడే మ్యాచ్‌ల్లో కోహ్లి, రోహిత్‌లు స్కోర్లు చేస్తారని ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌.. కోహ్లి, రోహిత్‌లనుద్దేశించి ట్విటర్‌లో సూపర్‌ మీమ్‌ పోస్ట్‌ చేశాడు.

అందాజ్‌ అప్నా అప్నా సినిమాలోని ఒక సన్నివేశాన్ని తీసుకొని కోహ్లి, రోహిత్‌లను పోల్చాడు. ఆ సన్నివేశంలో షారుక్‌ ఖాన్‌, అమీర్‌ఖాన్‌లు కాఫీని పంచుకుంటారు. '' ఇవాళ కోహ్లి, రోహిత్‌లు తాము ఆడబోయే మ్యాచ్‌ల్లో స్కోర్లను చేయాలని ఆశిస్తున్నా. ఒకేరోజు వేర్వేరుగా వేర్వేరు మ్యాచ్‌ల్లో తలపడుతున్నారు. కోహ్లి, రోహిత్‌ ఫ్యాన్స్‌కు ఇకనైనా పండగ ఇస్తారా'' అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం జాఫర్‌ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు