IND vs NZ: అతడు చాలా డేంజరేస్‌.. టీమిండియా ఓపెనర్‌గా రావాలి

17 Nov, 2022 19:51 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

వెల్లింగ్టన్‌ వేదికగా  శుక్రవారం(నవంబర్‌ 18) న్యూజిలాండ్‌తో తొలి టీ20లో తలపడేందకు టీమిండియా సిద్దమైంది. హార్దిక్‌ సారథ్యంలోని భారత జట్టు కివీస్‌ను వాళ్ల గడ్డపైనే చిత్తు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక సిరీస్‌కు భారత సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ దూరమయ్యారు. దీంతో టీ20 సిరీస్‌లో భారత ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది.

ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్‌తో రిషబ్ పంత్‌ ఓపెనర్‌గా రావాలని జాఫర్‌ సూచించాడు. అదే విధంగా భారత ప్లేయింగ్‌ ఎలవెన్‌ గురించి జాఫర్‌ మాట్లాడుతూ.. "భారత ఇన్నింగ్స్‌ను శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌ కలిసి ప్రారంభించాలి నేను భావిస్తున్నాను. పంత్‌ విధ్వంసకర ఆటగాడు.

పవర్‌ ప్లేలో దూకుడుగా ఆడి పరుగులు రాబట్టే సత్తా పంత్‌కు ఉంది. అతడు ఇరవై, మూఫ్పై పరుగులు వరకు ఆజేయంగా ఉంటే.. అనంతరం మరింత చెలరేగి ఆడుతాడు. ఇక మూడు నాలుగు స్థానాల్లో  శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌కు రావాలి. ఐదో స్థానంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌కు వస్తాడని నేను అనుకుంటున్నాను. ఆరో స్దానంలో దీపక్‌ హుడాకు బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కుతుంది.

ఇక జట్టులో వాషింగ్టన్‌ సుందర్‌కు కూడా చోటు లభిస్తుంది. స్పెషలిస్టు స్పిన్నర్‌గా చాహల్‌, కుల్దీప్‌లో ఎవరో ఒకరికి చోటు దక్కుతుంది. ఇక ఫాస్ట్‌ బౌలర్లగా సిరాజ్‌, ఆర్ష్‌దీప్‌, హర్షల్‌ పటేల్‌ తుద జట్టులో ఉంటారు. మరో వైపు తొలి టీ20కు భువనేశ్వర్‌ కుమార్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం" ఉంది అని అతడు పేర్కొన్నాడు.
చదవండిIND vs NZ: వాళ్లకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారు.. జట్టుతో ఉండాలి కదా?

మరిన్ని వార్తలు