"ఓ మై గాడ్".. క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌..

11 Mar, 2022 16:07 IST|Sakshi

మార్ష్‌కప్‌ ఫైనల్లో భాగంగా న్యూ సౌత్ వేల్స్‌తో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో న్యూ సౌత్ వేల్స్‌ను ఓడించి వెస్ట్రన్ ఆస్ట్రేలియా మార్ష్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫీల్డర్‌ హిల్టన్ కార్ట్‌రైట్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. న్యూ సౌత్ వేల్స్‌ ఇన్నింగ్స్‌ 44 ఓవర్‌ వేసిన డిఆర్సీ షార్ట్ బౌలింగ్‌లో.. హెన్రిక్స్ లాంగ్‌ ఆన్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ ఖాయమని అంతా భావించారు.

అయితే బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న కార్ట్‌రైట్ పరిగెత్తుకుంటూ వచ్చి  డైవ్‌ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కార్ట్‌రైట్ తన స్టన్నింగ్‌ క్యాచ్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో మంచి ఊపు మీద ఉన్న హెన్రిక్స్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక హెన్రిక్స్ ఔటయ్యక  న్యూ సౌత్ వేల్స్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగా ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెన్‌క్రాప్ట్‌(39), జో రిచర్డ్‌సన్(44) పరుగులతో రాణించారు. ఇక 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ సౌత్ వేల్స్‌ 46.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. న్యూ సౌత్ వేల్స్‌ బ్యాటర్లలో హెన్రిక్స్(43), డానియల్‌ సామ్స్‌(42) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు.

చదవండి: IPL 2022: రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌ కోచ్‌గా లసిత్ మలింగ..

మరిన్ని వార్తలు