కొడుకు నడిచాడు.. వారి ముఖాల్లో ఆనందం వెల్లివెరిసింది

16 May, 2021 21:52 IST|Sakshi

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా.. అతని భార్య నటాషా స్టాంకోవిక్‌ ఫుల్‌ హ్యాపీగా ఉ‍న్నారు. వారి హ్యాపీకి కారణమేంటో తెలుసా.. వారి గారాలపట్టి అగస్త్య. కరోనా మహమ్మారితో ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు కావడంతో పాండ్యా తన కొడుకుతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు. తాజాగా తన కొడుకు నడక నేర్పే క్రమంలో నటాషాతో కలిసి అగస్త్యకు ప్రాక్టీస్‌ చేయించాడు. అలా అగస్త్య పాండ్యా  దగ్గరి నుంచి మెల్లిగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ  తల్లి నటాషా వద్దకు చేరుకున్నాడు. దీంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివెరిసింది.

దీనికి సంబంధించిన వీడియోనూ ముంబై ఇండియన్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. '' బేబీ పాండ్యా ఈజ్‌ ఆన్‌ ది మూవ్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఇక కివీస్‌తో జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌ సిరీస్‌కు హార్దిక్‌ను ఎంపిక చేయలేదు. అయితే జూలైలో లంక పర్యటనకు పాండ్యాను ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే వెన్నునొప్పి నుంచి కోలుకున్నాకా హార్దిక్‌ కేవలం బ్యాటింగ్‌కు పరిమితమయ్యాడు. ఐపీఎల్‌కు ముందు జరిగిన ఆసీస్‌, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో ఎక్కువగా బౌలింగ్‌ చేయలేదు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనే 8 మ్యాచ్‌ల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు.  
చదవండి: వాడిలో ఇన్ని వేరియేషన్స్‌ ఉన్నాయని నాకు తెలియదు

కొడుకును ముద్దు చేస్తున్న పాండ్యా.. వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు