BBL 2021: మా బంతి పోయింది.. కనబడితే ఇచ్చేయండి!

24 Dec, 2021 16:12 IST|Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌ 2021లో శుక్రవారం మెల్‌బోర్న్‌ స్టార్స్‌, హోబర్ట్‌ హరికేన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. మెల్‌బోర్న స్టార్స్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌ నీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ నాలుగో బంతిని హోబర్ట్‌ హరికేన్స్‌ ఓపెనర్‌ బెన్‌ మెక్‌డెర్మోట్‌ డీప్‌ బ్యాక్‌వర్డ్‌స్క్వేర్‌ మీదుగా భారీ సిక్స్‌ కొట్టాడు. అయితే బంతి వెళ్లి స్డేడియం అవతల చాలా దూరంలో పడింది. దీంతో దెబ్బకు అంపైర్లు కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోనే బిగ్‌బాష్‌ లీగ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ..'' మా బంతి పోయింది.. ఒకవేళ కనిపిస్తే బ్లండ్స్‌స్టోన్‌ ఎరీనాకు తెచ్చివ్వండి'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

కాగా మ్యాచ్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌ 24 పరుగుల తేడాతో మెల్‌బోర్న్‌ స్టార్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హోబర్ట్‌ హరికేన్స్‌కు ఓపెనర్లు బెక్‌ డెర్మోట్‌(67 పరుగులు), మాధ్యూ వేడ్‌(39 పరుగులు) తొలి వికెట్‌కు 93 పరుగుల జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ తలా ఒక చెయ్యి వేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. జో క్లార్క్‌ 52 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జో బర్న్స్‌ 22, హిల్టన్‌ కార్ట్‌రైట్‌ 26 పరుగులు చేశారు. 

మరిన్ని వార్తలు