సిక్సర్ల హోరు.. యునివర్సల్‌ బాస్‌ విధ్వంసం

4 Feb, 2021 17:16 IST|Sakshi

దుబాయ్‌: యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు.40 ఏళ్ల వయసులోనూ మంచినీళ్ల ప్రాయంగా సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. తాజాగా అబుదాబి టీ10 లీగ్‌లో గేల్‌ మరోసారి రెచ్చిపోయాడు. కొడితే ఫోర్‌.. లేదంటే సిక్స్‌ అన్నట్లుగా సునామీ ఇన్నింగ్స్‌తో విజృంభించాడు. బుధవారం మరాఠా అరేబియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ అబుదాబికి ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్‌ 22 బంతుల్లోనే 9 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 84 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. చదవండి: బుమ్రాకు 'తొలి' టెస్టు.. ఐసీసీ ఆల్‌ ది బెస్ట్‌

కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గేల్.. టీ10 చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన మహమ్మద్ షహజాద్ రికార్డును సమం చేశాడు. 2018 సీజన్లో షెహజాద్ రాజ్‌పుత్స్ తరఫున 12 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియన్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ అబుదాబి జట్టులో ఓపెనర్‌ గేల్ విధ్వంసంతో 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. గేల్ చేసిన 84 పరుగుల్లో 78 రన్స్ బౌండరీల రూపంలోనే రావడం విశేషం. చదవండి: టీమిండియాకు జో రూట్‌ వార్నింగ్‌

మరిన్ని వార్తలు