అయ్యో.. రషీద్‌ అలా ఓడిపోయావేంటి?

16 Oct, 2020 18:22 IST|Sakshi
రషీద్‌ ఖాన్‌( కర్టసీ : ఐపీఎల్‌/ బీసీసీఐ)

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మోస్తరు ప్రదర్శతో ఆకట్టుకుంటుంది. లీగ్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన ఎస్‌ఆర్‌హెచ్‌ పడుతూ.. లేస్తూ.. విజయాలు సాధిస్తుంది. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌ వరుసగా రెండు ఓటములు నమోదు చేసిన తర్వాత కొంచెం గ్యాప్‌ లభించినట్టయింది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన ఎస్‌ఆర్‌హెచ్‌ మూడు విజయాలు.. ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. కాగా సన్‌రైజర్స్‌ ఆదివారం కేకేఆర్‌తో తలపడనుంది.(చదవండి : ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి : గేల్‌)

ఇదిలా ఉండగా కరోనా నేపథ్యంలో ఆటగాళ్లందరూ బయో బబూల్‌ వాతావరణం దాటి బయటకు రావడానికి వీలేదు. ఏం చేసినా.. ఎంత ఎంజాయ్‌ చేసినా ఆటగాళ్ల మద్యే తప్ప బయట ప్రపంచంలో తిరిగే అవకాశం లేదు. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌కు నాలుగురోజులు గ్యాప్‌ రావడంతో ప్రాక్టీస్‌తో పాటు ఎంజాయ్‌మెంట్‌కు కొంత స్పేస్‌ ఇచ్చారు. ప్రాక్టీస్‌ ముగిసిన తర్వాత ​అఫ్గనిస్తాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో బాటిల్‌ ఫ్లిప్‌ చాలెంజ్‌ నిర్వహించారు. ఈ చాలెంజ్‌లో రషీద్‌ సహా ​ అబ్ధుల్‌ సమద్‌, ప్రియమ్‌ గార్గ్‌ సహా కొంతమంది పాల్గొన్నారు. అయితే రషీద్‌ నిర్వహించిన ఈ చాలెంజ్‌లో మొదటిసారి వేసినప్పుడు రషీద్‌ సహా అబ్దుల్ సమద్‌, ప్రియమ్‌ గార్గ్‌ బాటిళ్లు నిటారుగా నిలబడగా.. మిగిలినవారివి కింద పడిపోయాయి. రెండోసారి వేసిన చాలెంజ్‌లో ఒక్క అబ్దుల్‌ సమద్‌ తప్ప రషీద్‌ సహా అందరు విఫలమయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ' రషీద్‌ చాలెంజ్‌ మొదలుపెట్టింది నువ్వే.. కానీ అలా ఓడిపోయావేంటి 'అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : 'బ్రావోతో నేనేందుకు అలా ప్రవర్తిస్తాను')

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు