పాపం.. చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయింది

28 Feb, 2021 21:20 IST|Sakshi

సిడ్నీ: షెఫీల్డ్ షీల్డ్‌ 2020-21 సిరీస్‌లో భాగంగా సౌత్‌ ఆస్ట్రేలియా, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.  కచ్చితంగా మ్యాచ్‌ గెలుస్తామని భావించిన జట్టు ఎవరు ఊహించని విధంగా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సౌత్‌ ఆస్ట్రేలియా విధించిన 332 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో మూడోరోజు ఆటగ ముగిసే సమయానికి వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా 88 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

ఆట చివరిరోజైన నాలుగో రోజు మూడు సెషన్ల పాటు ఓపికగా ఆడినా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అలా ఆట ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా 143 పరుగుల వద్ద 9వ వికెట్‌ కోల్పోయింది. సౌత్‌ ఆస్ట్రేలియాకు విజయానికి ఒక వికెట్‌ అవసరం.. క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు. దీంతో సర్కిల్‌లోనే దాదాపు 9 మంది ఉన్నారు. ఏకంగా స్లిప్‌లో 6గురు ఫీల్డర్లు ఉన్నారు. 4వ ఓవర్ల పాటు ఓపికగా ఆడిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ 5 పరుగులు జత చేశారు.

ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ను చాడ్ సేయర్స్ వేశాడు. క్రీజులో లియామ్‌ ఓ కోనర్‌, లియామ్‌ గుత్రేయి ఉన్నారు. ఆఖరి బంతిని కోనర్‌ ఫ్లిక్‌ చేయగా.. బ్యాట్‌ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచి స్లిప్‌లో పడింది. అప్పటికే ఆరుగురు ఫీల్డర్లు ఉండడంతో క్యాచ్‌ అని భావించారు. అయితే అనూహ్యంగా ఫీల్డర్‌ చేతిని తప్పించుకొని బంతి కింద పడింది. అలా మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో విజయం చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోయిందనుకుంటూ సౌత్‌ ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సౌత్‌ ఆస్ట్రేలియా బ్యాటింగ్‌
మొదటి ఇన్నింగ్స్‌: 510/8 డిక్లెర్డ్‌
రెండో ఇన్నింగ్స్‌: 230/9 డిక్లెర్డ్‌

వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బ్యాటింగ్‌
మొదటి ఇన్నింగ్స్‌: 409/5 డిక్లెర్డ్‌
రెండో ఇన్నింగ్స్‌: 148/9

చదవండి: 169 నాటౌట్‌.. అయినా గెలిపించలేకపోయాడు
రెండు రన్స్‌తో డబుల్‌ సెంచరీ మిస్‌.. కేకేఆర్‌లో జోష్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు