Shikar Dhawan-Varun Dhawan: శిఖర్‌ ధావన్‌ను భరించడమే కష్టం; మరో ధావన్‌ జతకలిస్తే..

13 Aug, 2022 16:07 IST|Sakshi

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌.. బాలీవుడ్‌ స్టార్‌ శిఖర్‌ ధావన్‌తో కలిసి ఫోటో దిగడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మాములుగానే శిఖర్‌ ధావన్‌ అల్లరిని తట్టుకోవడం కష్టం.. అలాంటిది అతనికి మరో ధావన్‌ తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు చెప్పింది కేవలం సరదా కోసమే. వాస్తవానికి శిఖర్‌ ధావన్‌ సహా టీమిండియా సభ్యులు ఇవాళ ఉదయమే జింబాబ్వే పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం నాలుగు గంటల సమయంలో వరుణ్‌ ధావన్‌ టీమిండియా సభ్యులతో కలిసి ఫోటోకు ఫోజిచ్చాడు. ఈ సందర్భంగా ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఇవాళ ఉదయం నాలుగు గంటల సమయంలో నేను చిన్నపిల్లాడిలా మారిపోయి క్యాండీ షాపులో తిరుగుతున్నా. ఆ సమయంలో టీమిండియా బృందం ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుపడింది. అంతే ఒక్కసారిగా సంతోషంతో వారి దగ్గరికి వెళ్లిపోయాను. జింబాబ్వే టూర్‌ విజయవంతగా ముగించుకొని తిరిగి రావాలని కోరుకున్నా. ఈ సందర్భంగా ధావన్‌ భయ్యాతో ఫోటో దిగడం ఆనందంగా అనిపించింది. 

ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు శనివారం జింబాబ్వేకు పయనమయ్యారు. శిఖర్‌ ధావన్‌, దీపక్‌ చహర్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ తదితరులు విమానంలో బయల్దేరారు.  వీరితో పాటు కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

కాగా వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో టీమిండియాను విజేతగా నిలిపిన శిఖర్‌ ధావన్‌ను తొలుతు జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు.అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కోలుకోవడంతో.. గబ్బర్‌ను తప్పించి అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఇక హరారే వేదికగా టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఆగష్టు 18న మొదటి వన్డే, ఆగష్టు 20న రెండో వన్డే, ఆగష్టు 22న మూడో వన్డే జరుగనున్నాయి.

చదవండి: వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లో ఆడడమే నా టార్గెట్‌: ధావన్‌

మరిన్ని వార్తలు