ఆస్ట్రేలియాలో అక్టోబర్ 13 నుంచి జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ బరిలోకి దిగనుంది. 22 ఏళ్ల జెమీమా మెల్‌బోర్న్ స్టార్స్ జట్టు తరఫున ఆడనుంది. గత సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జెమీమా 333 పరుగులు సాధించింది. ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో జెమీమాతోపాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (మెల్‌బోర్న్ రెనెగేడ్స్), పూజా వస్త్రకర్ (బ్రిస్బేన్ హీట్) కూడా ఆడనున్నారు.