పాక్‌లో బాబర్‌ ఆజమ్‌ కంటే కోహ్లికే క్రేజ్‌ ఎక్కువ.. ఇది చూడండి..!

13 Dec, 2022 17:21 IST|Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. కింగ్‌కు దాయాది దేశం పాక్‌లోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందన్న విషయం మరోసారి నిరూపితమైంది. ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్‌ సందర్భంగా ఇద్దరు పాక్‌ అభిమానులు కోహ్లిపై ఉన్న అభిమానాన్ని  వినూత్నంగా చాటుకున్నారు.

వచ్చే ఏడాది జరుగనున్న ఆసియా కప్‌లో ఆడేందుకు కోహ్లి పాక్‌కు రావాలని ప్లకార్డ్‌లు పట్టుకుని మరీ విన్నవించుకున్నారు. కింగ్‌ కోహ్లి పాక్‌కు వచ్చి ఆసియా కప్‌ ఆడాలని మొరపెట్టుకున్నారు. ఓ అభిమాని అయితే.. మా కింగ్‌ బాబర్‌ ఆజమ్‌ కంటే నిన్నే ఎక్కువ ఇష్టపడతాం అంటూ కోహ్లిపై అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. 

ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది పాక్‌లో జరిగే ఆసియా కప్‌లో ఆడేది లేదని భారత్‌ ఇదివరకే స్పష్టం చేసింది. ఇందుకు ప్రతిగా పాక్‌.. తాము సైతం భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడేది లేదని బెదిరింపులకు దిగింది. పాక్‌ ఉడత బెదిరింపులకు భయపడేది లేదని, ఆ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో అడుగుపెట్టేది లేదని భారత వర్గాలు తెగేసి చెప్పడంతో పాక్‌ తోకముడిచి ఆ ప్రస్తావనకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది.

ఈ నేపథ్యంలో పాక్‌కు చెందిన అభిమానులు కోహ్లి కోసం, టీమిండియా పాక్‌లో ఆడటం కోసం చేసిన విన్నపం క్రికెట్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. కొందరు ఆటను ఇతర విషయాలతో ముడిపెట్టడం సబబు కాదని, ఆటను ఆటలా చూసి పాక్‌లో క్రికెట్‌ ఆడాలని కోరుతున్నారు. అక్కడ కూడా కోహ్లికి వీరాభిమానులు ఉన్నారు.. వారు కింగ్‌ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తపిస్తున్నారంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు