విండీస్‌దే వన్డే సిరీస్‌

14 Mar, 2021 05:20 IST|Sakshi

ఎవిన్‌ లూయిస్‌ సెంచరీ

రెండో మ్యాచ్‌లోనూ లంక ఓటమి

నార్త్‌సౌండ్‌: శ్రీలంకతో రెండో వన్డేలో వెస్టిండీస్‌ ఐదు వికెట్లతో నెగ్గి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ జట్టు 49.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఎవిన్‌ లూయిస్‌ (103; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. షై హోప్‌ (84; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 192 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి ఓవర్లో విండీస్‌ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. పూరన్‌ (35 నాటౌట్‌; 4 ఫోర్లు) మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విండీస్‌ జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది. గుణతిలక (96; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), చండీమల్‌ (71; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు