WI vs IND: పూరన్‌ సింగిల్‌ హ్యాండ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌!

23 Jul, 2022 12:51 IST|Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. భారత ఇన్నింగ్స్‌ 36 ఓవర్‌ వేసిన గుడాకేష్ మోటీ బౌలింగ్‌లో.. శ్రేయస్‌ అయ్యర్‌ కవర్స్‌ దిశగా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పూరన్‌ జంప్‌ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. కాగా అప్పటికే 54 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్న అయ్యర్‌ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మాన్‌ గిల్‌ను కూడా అద్భుతమైన త్రోతో పూరన్‌ పెవిలియన్‌కు పంపాడు.

ఇక తొలి వన్డేలో అఖరి వరకు పోరాడిన విండీస్‌ మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు మాత్రమే చేసింది. విండీస్‌ జట్టులో  కైలే మేయర్స్‌ 75 పరుగులు, బ్రాండన్‌ కింగ్‌ 54 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, చహల్‌ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారత్‌  50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ 97 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్‌ గిల్‌ (64) శ్రేయస్‌ అయ్యర్‌(54) పరుగులతో రాణించారు.
ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ తొలి వన్డే:
►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
►టాస్‌: విండీస్‌- బౌలింగ్‌
►భారత్‌ స్కోరు: 308/7 (50 ఓవర్లు)
►వెస్టిండీస్‌ స్కోరు: 305/6 (50 ఓవర్లు)
►విజేత: భారత్‌.. 3 పరుగుల తేడాతో గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: శిఖర్‌ ధావన్‌ ‌(97 పరుగులు)
►అర్ధ శతకాలతో రాణించిన గిల్‌(64), శ్రేయస్‌ అయ్యర్‌(54)
చదవండి:
IND vs WI: టీమిండియాతో వన్డే సిరీస్‌.. వెస్టిండీస్‌కు బిగ్‌ షాక్‌..!

మరిన్ని వార్తలు