Dilip Vengsarkar: టీమిండియాకి ఆడాలంటే ఇది సరిపోదా.. ఇంకా ఏం చేయాలి?

13 Jun, 2022 19:51 IST|Sakshi

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అదరగొడుతన్న యువ ఆటగాడు  సర్ఫరాజ్ ఖాన్‌కు భారత జట్టలో చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక 2022 రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఉత్తరాఖండ్‌తో జరగిన క్వార్టర్-ఫైనల్‌లో 153 పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు 704 పరుగులు సాధించాడు. గత రంజీ సీజన్‌లో కూడా సర్ఫరాజ్ అద్భుతంగా రాణించాడు. అతడు 928 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 80.4 సగటుతో 2252 పరుగులు చేశాడు.

"సర్ఫరాజ్ ఖాన్‌ ఇప్పటికే టీమిండియా తరపున ఆడుతూ ఉండాలి. అతడు రంజీ ట్రోఫీలో ప్రతిసారీ  పరుగులు వరుద పారిస్తున్నాడు. సెలెక్టర్లు ఇప్పటికీ అతడిని ఎంపిక చేయకపోవడంతో నేను ఆశ్చర్యపోయాను. ప్రతీ సీజన్‌లోనూ అతడు ముంబై జట్టుకు 800 కంటే ఎక్కువ పరుగులు చేస్తున్నాడు.

భారత జట్టులోకి రావాలంటే అతడు ఏం చేయాలో మీరే చెప్పండి. నేను అతడిని 12 సంవత్సరాల వయస్సు నుంచి చూస్తున్నాను. అతడు చాలా ప్రతిభావంతుడు. అతడు చాలా ఫిట్‌గా ఉన్నాడు. అంతే కాకుండా అతడు ఓపికతో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగలడు. అదే విధంగా జట్టును గెలిపించగల సత్తా అతడికి ఉంది" అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: జట్టులో అతడు తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేరు: సునీల్ గావస్కర్

మరిన్ని వార్తలు