వావ్‌..చీరలోనే అదరగొట్టిందిగా...!

8 Jan, 2021 14:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా మహిళలు చీర కట్టులో కొన్ని పనులు చేయడానికి ఇబ్బంది పడటం సహజం.  ముఖ్యంగా  క్రీడల్లో అయితే మరీ కష్టం.  అందులోనూ  చీరలో జిమ్నాస్టిక్స్‌  చేయడం మంటే కత్తి మీద సామే.. ఎంతో సాధన చేస్తే  కానీ సాధ్యం కాదు.  అయితే ఇటీవలి కాలంలో చీరలో ఇలాంటి విన్యాసాలు చేస్తున్న వనితల  వీడియోలు  సోషల్‌ మీడియాలో  అబ్బుర పరుస్తున్నాయి. మగువలు తలచు కోవాలేగానీ, సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఒక  యువతి చీరలో అతి సునాయాసంగా పల్టీలు కొడుతున్న తీరు  ఔరా అనిపిస్తోంది. చాలా నేర్పుగా, ఒడుపుగా తన విద్యను ప్రదర్శించిన  తీరు నెటిజనులను ఆకట్టుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఒకసారి చూసేయండి.. అన్నట్టు నో అబ్యూజ్‌ కమెంట్స్‌ ప్లీజ్‌.. ప్రతిభ ఏ రూపంలో ఉన్నా అభినందించాల్సిందే.  వారి పట్టుదలను మె‍చ్చుకోవాల్సిందే! ఏమంటారు?

మరిన్ని వార్తలు