IPL 2022: తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.. ఎవరీ కుమార్ కార్తికేయ..?

1 May, 2022 14:42 IST|Sakshi
PC: IPL.Com

ఐపీఎల్‌-2022లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్‌ తొలి విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తెడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఇది ఇలా ఉంటే.. ముంబై ఇండియన్స్‌ స్పిన్నర్‌ కుమార్‌ కార్తికేయ ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన కార్తికేయ 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ సాధించాడు.

దూకుడుగా ఆడుతున్న సంజూ శాంసన్‌ను ఔట్‌ చేసి రాజస్తాన్‌ పరుగుల జోరుకు కార్తికేయ బ్రేక్‌లు వేశాడు. దీంతో  కార్తికేయ ఎవ‌ర‌నే అంశంపై అభిమానులు  తెగ చ‌ర్చిస్తున్నారు. ఈ క్రమంలో కార్తికేయ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఐపీఎల్‌-2022లో గాయపడిన పేసర్ అర్షద్ ఖాన్ స్థానంలో మధ్యప్రదేశ్ స్పిన్నర్‌ కుమార్‌ కార్తికేయతో ముంబై ఇండియన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్తికేయ దేశీవాళీ టోర్నీల్లో మధ్య ప్రదేశ్‌ తరపున ఆడుతున్నాడు. 2018లో లిస్ట్-ఎ క్రికెట్‌లో కార్తికేయ అరంగేట్రం చేశాడు. ఇక కార్తికేయ తన డొమాస్టిక్‌ కెరీర్‌లో ఇప్పటివరకు తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 19 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 35 వికెట్లు, లిస్ట్‌-ఎ కెరీర్‌లో 18 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా  2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా రాణించాడు.

చదవండి: IPL 2022: "చాలా మంది భారత స్టార్‌ ఆటగాళ్ల కంటే హార్ధిక్‌ బెటర్‌"

మరిన్ని వార్తలు