IPL 2022: సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్‌ పాటిదార్‌..?

26 May, 2022 11:48 IST|Sakshi
రజత్‌ పాటిదార్‌ (PC: IPL/BCCI)

IPL 2022 LSG Vs RCB- Rajat Patidar: ఐపీఎల్‌-2022లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ  ఆటగాడు రజత్‌ పాటిదార్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 54 బంతుల్లోనే 112 పరుగులు సాధించి.. ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 14 పరుగుల తేడాతో గెలిపొంది.. రాజస్తాన్‌ రాయల్స్‌తో క్వాలిఫెయిర్‌2కు సిద్దమైంది. అయితే కీలకమైన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన పాటిదార్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాటిదార్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఎవరీ రజత్‌ పాటిదార్‌..?
మధ్య ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల పాటిదార్‌ 2020 నుంచి 2021 సీజన్‌ వరకు ఆర్‌సీబీ జట్టులో భాగమై ఉన్నాడు. అయితే పాటిదార్‌ చాలా మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు పటిదార్‌ను ఆరీసీబీ విడిచి పెట్టింది. ఇక వేలంలో పాల్గొన్న అతడిని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరచలేదు.

అయితే ఈ ఏడాది టోర్నీ మధ్యలో గాయపడిన లువ్నిత్ సిసోడియా స్ధానంలో పటిదార్‌ను ఆర్‌సీబీ భర్తీ చేసుకుంది. దీంతో మళ్లీ అతడికి ఆర్‌సీబీ తరపున ఆడే అవకాశం దక్కింది. ఇక డొమాస్టిక్‌ క్రికెట్‌లో మధ్య ప్రదేశ్‌ తరపున పటిదార్‌ ఆడుతున్నాడు. 39 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పటిదార్‌ 2500పైగా పరుగులు సాధించాడు. అదే విధంగా 43 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 38 టీ20లు కూడా ఆడాడు. టీ20ల్లో తన 1000 పరుగులను కూడా పటిదార్‌ పూర్తి చేసుకున్నాడు.

చదవండి: IPL 2022: రజత్‌ పాటిదార్‌ కొత్త చరిత్ర.. ఆర్‌సీబీ తరపున తొలి బ్యాటర్‌గా


 

Poll
Loading...
మరిన్ని వార్తలు