Carlos Alcaraz: అల్‌కరాజ్‌ అందమైన గర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా?

18 Jul, 2023 08:54 IST|Sakshi

దశాద్దం కిందట పురుషుల టెన్నిస్‌లో ఎక్కువగా వినిపించిన పేర్లు ముగ్గురివే. స్విజ్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌.. స్పెయిన్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌.. సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌.. గత పదేళ్లలో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు నాలుగు మేజర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఎగురేసుకుపోయేవారు. మధ్యలో ముర్రే, డానిల్‌ మెద్వెదెవ్‌, కాస్పర్‌ రూడ్‌ సహా చాలా మంది స్టార్లు వచ్చినా ఎవరు ఈ త్రయం ముందు నిలబడలేకపోయారు. కానీ రెండేళ్లుగా టెన్నిస్‌లో ఒక పేరు మార్మోగిపోతుంది. అతనే స్పెయిన్‌ నుంచి వచ్చిన యువ సంచలనం కార్లోస్‌ అల్‌కరాజ్‌.

ప్రస్తుతం వరల్డ్‌ నెంబర్‌వన్‌గా ఉన్న అల్‌కరాజ్‌ రాబోయే రోజుల్లో టెన్నిస్‌ను శాసించేలా కనిపిస్తున్నాడు. ఫెదరర్‌, నాదల్‌, జొకోవిచ్‌ల తర్వాత టెన్నిస్‌ ఏలే రారాజులా కనిపిస్తున్నాడు. 20 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న అల్‌కరాజ్‌ సంచలనాలు సృష్టిస్తున్నాడు. 2022లో యూఎస్‌ ఓపెన్‌ గ్గిన అల్‌కరాజ్‌.. తాజాగా 2023లో వింబుల్డన్‌ నెగ్గి కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌ సాధించాడు. వింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్‌ జొకోవిచ్‌ కలను అల్‌కరాజ్‌ చెరిపేశాడు.

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అల్‌కరాజ్‌ ప్రేమించడంలోనూ దూసుకెళ్తున్నాడు. తన దేశానికే చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ మారియా గొంజాలెజ్‌ గిమినేజ్‌తో అల్‌కరాజ్‌ ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్‌ వచ్చాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ప్ర‌స్తుతం సీక్రెట్‌గా కొన‌సాగుతున్నా.. ఇటీవ‌ల కార్లోస్ ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టు కొన్ని డౌట్స్ క్రియేట్ చేసింది.

మారియాను కిస్ ఇస్తున్న ఫోటోను అల్క‌రాజ్ త‌న ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. దీంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉందని టెన్నిస్ అభిమానులు డిసైడ్ అయిపోయారు. 20 ఏళ్ల అల్క‌రాజ్ కొన్నాళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. అయితే ఆ ఇద్ద‌రి పెళ్లి చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మారియా కూడా ముర్సియా క్ల‌బ్ త‌ర‌పునే టెన్నిస్ ఆడుతుంది.

అల్క‌రాజ్ త‌న కెరీర్‌లో ఇప్ప‌టికే 12 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ గెలిచాడు. గ‌త ఏడాది యూఎస్ ఓపెన్ సొంతం చేసుకున్నాడు. నాలుగు మాస్ట‌ర్స్ టైటిళ్ల‌ను కూడా అత‌ను కైవ‌సం చేసుకున్నాడు. జోకోవిచ్ ప్రాక్టీసు మ్యాచ్‌ల‌ను వీడియో తీసిన వివాదంలో అల్క‌రాజ్ ఇరుక్కున్నా.. వింబుల్డ‌న్ ఫైన‌ల్లో అత‌నే ఓడించ‌డం గ‌మ‌నార్హం.

మరిన్ని వార్తలు