IPL 2022: ఆర్‌సీబీతో తలపడనున్న ఎస్‌ఆర్‌హెచ్‌.. టాస్‌ గెలిస్తే..!

7 May, 2022 12:40 IST|Sakshi

SRH vs RCB Match Prediction: ఐపీఎల్‌-2022లో వాంఖడే వేదికగా ఆదివారం(మే8) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ మధ్యహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక వరుసగా మూడు ఓటుములతో డీలా పడ్డ ఎస్‌ఆర్‌హెచ్‌.. ఆర్సీబీపై విజయం సాధించి తిరిగి తమ విన్నింగ్‌ ట్రాక్‌ను పొందాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌.. 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

ఇక బ్యాటింగ్‌ పరంగా ఎస్‌ఆర్‌హెచ్‌ అద్భుతంగా రాణిస్తోంది. బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. గత మూడు మ్యాచ్‌ల్లో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇక అఖరి మ్యాచ్‌కు దూరమైన నటరాజన్‌ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇక వరుస అపజయాలతో సతమతమైన ఆర్సీబీ గత మ్యాచ్‌లో సీఎస్‌కేపై విజయం సాధించి తిరిగి గాడిలో పడింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ పరంగా ఆర్సీబీ రాణిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎటువంటి మార్పులు లేకుండా ఆర్‌సీబీ బరిలోకే దిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో  స్థానంలో ఉంది. ఇక ఇరు జట్లు ముఖాముఖి 21 సార్లు తలపడగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ 12 మ్యాచ్‌లల్లో విజయం సాధించగా.. ఆర్‌సీబీ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఎటువంటి ఫలితం తేలలేదు.

పిచ్‌ రిపోర్ట్‌
వాంఖడే స్టేడియం వేదికగా రాజస్తాన్‌, కోల్‌కతా మధ్య జరిగిన గత మ్యాచ్‌లో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించింది. 153 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌ సునాయాసంగా ఛేదించింది.  టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది.

తుది జట్లు(అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్‌ కీపర్‌), శశాంక్ సింగ్, సీన్ అబాట్, శ్రేయాస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్ ఉమ్రాన్ మాలిక్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్

చదవండి: IPL 2022: స్టేడియంలో సందడి చేసిన రణవీర్ సింగ్.. సెలబ్రేషన్స్‌ మామూలుగా లేవుగా

మరిన్ని వార్తలు