BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్‌! కిట్‌ స్పాన్సర్‌ కూడా! కారణం?

22 Dec, 2022 07:53 IST|Sakshi
భారత జట్టు

Team India- Sponsorship- Byju's- MPL- ముంబై: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న ఎడ్యుటెక్‌ సంస్థ ‘బైజూస్‌’ ఈ ఒప్పందాన్ని ముందే రద్దు చేసుకునే యోచనలో ఉంది. దీనికి సంబంధించి గత నెలలోనే బోర్డుకు ఆ సంస్థ లేఖ రాసింది. నవంబర్‌ 2023 వరకు అమల్లో ఉండేలా సుమారు రూ. 290 కోట్లతో గత జూన్‌లోనే బీసీసీఐతో బైజూస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

కారణమిదే
అయితే ఆ సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించరాదని భావిస్తోంది. ఈ అంశంపై బుధవారం జరిగిన బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చ జరిగింది. చివరకు 2023 మార్చి వరకు స్పాన్సర్‌షిప్‌ కొనసాగించాలని బైజూస్‌కు బీసీసీఐ విజ్ఞప్తి చేసింది.

కిట్‌ స్పాన్సర్‌ సైతం
మరోవైపు కిట్‌ స్పాన్సర్‌గా ఉన్న ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ కూడా తమ కిట్‌ ఒప్పంద హక్కులను మరో సంస్థకు వెంటనే బదలాయించేందుకు అనుమతించమని బోర్డును కోరింది. అదే మొత్తానికి కేవల్‌ కిరణ్‌ క్లాతింగ్‌ లిమిటెండ్‌ (కేకేసీఎల్‌)కు కిట్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులు ఇవ్వమని కోరింది.

దీనిపై కూడా చర్చించిన బోర్డు... ఉన్నపళంగా కిట్‌ స్పాన్సర్‌ పేరు మార్పుల వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి ఎంపీఎల్‌కు కూడా మార్చి 31, 2023 వరకు కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. 

చదవండి: Ajinkya Rahane: డబుల్‌ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ..
Inzamam Ul Haq: 52 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే! పవర్‌ఫుల్‌ సిక్సర్‌.. ఆశ్చర్యపోయిన ఆఫ్రిది! వీడియో

మరిన్ని వార్తలు