ప్రముఖ మోడల్‌తో పంత్‌ డేటింగ్‌.. పాత గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌..?

2 Apr, 2021 16:07 IST|Sakshi

న్యూఢిల్లీ: కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న టీమిండియా యువ డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిష‌బ్ పంత్.. అదే ఫామ్‌ను రియల్‌ లైఫ్‌లోనూ కొనసాగిస్తున్నాడు. పాత గర్ల్‌ఫ్రెండ్‌, బాలీవుడ్‌ భామ ఊర్వశీ రౌటేలాతో రిలేషన్‌షిప్‌కు బ్రేకప్‌ చెప్పి, ప్రముఖ మోడల్‌ఇషా నేగితో డేటింగ్‌ చేస్తున్నాడు. ఇటీవల రౌటేలా వ్యాట్సాప్‌ను బ్లాక్ చేసిన పంత్.. తాజాగా ఇషా నేగితో దిగిన ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్‌ బహిర్గతమైంది. ఈ పోస్ట్‌లో పంత్‌.. ఇషాను ఎంత ఇష్టపడుతున్నాడో స్పష్టంగా తెలియజేశాడు. నిన్ను నేనెప్పుడూ హ్యాపీగా ఉంచాల‌నుకుంటున్నాను.. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండ‌టానికి నువ్వే కారణమంటూ త‌న పోస్టులో రాశాడు. 

A post shared by Rishabh Pant (@rishabpant)

A post shared by Isha Negi (@ishanegi_)

మరోవైపు ఇషాకు కూడా పంత్‌పై అమితమైన ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పంత్‌తో దిగిన ఫోటోలను త‌న ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. నువ్వే నా మ‌గాడివి, నువ్వే నా ఆత్మవి, నా బెస్ట్ ఫ్రెండ్‌వి, నా జీవితానికి నువ్వే ప్రేమ‌వ‌ంటూ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌పై ప్రేమను ఒలకబోసింది. వృత్తి రిత్యా ఇంటీరియర్‌ డిజైనర్‌ అయిన ఇషా.. అమిటీ యూనివర్శిటీ నుంచి బీఏ హాన‌ర్స్‌ డిగ్రీ పొందింది. కాగా, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రౌటేలా మాట్లాడుతూ.. పంత్‌ గురించి తనకు తెలీదని, క్రికట్‌ను తానంతగా ఇష్టపడనని, సచిన్‌..కోహ్లి అంటే తనకు గౌరవమని పేర్కొనడం విశేషం. 
చదవండి: మరోసారి కేఎల్‌ రాహుల్‌ విధ్వంసం ఖాయం: పంజాబ్‌ కోచ్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు