T20 WC 2022: పాపం బం‍గ్లాదేశ్‌.. 5 పరుగుల పెనాల్టీ! ఎందుకంటే?

27 Oct, 2022 12:26 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో దక్షిణాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. సూపర్‌-12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం నమోదు చేసింది. 206 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 101 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్‌ బౌలర్లలో నోర్జే నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్‌ పతనాన్ని శాసించగా.. షాంసీ మూడు, రబాడ, మహారాజ్‌ తలా వికెట్‌ సాధించారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రోటీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో రిలీ రోసో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో  56 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్‌ డికాక్‌ 63 పరుగులతో రాణించాడు.

ఇక​ ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. బం‍గ్లా వికెట్‌ కీపర్‌ నూరల్‌ హసన్‌ చేసిన చిన్న తప్పిదం వల్ల దక్షిణాఫ్రికా 5 పెనాల్టీ పరుగులు లభించించాయి.

ఏం జరిగిందంటే
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 11 ఓవర్‌ వేసిన షకీబ్‌ ఆల్‌ హసన్‌ బౌలింగ్‌లో అఖరి బంతి డెలివర్ కాకముందే బం‍గ్లా వికెట్‌ కీపర్‌ నూరుల్ హసన్  ఎడమ వైపుకు వెళ్లాడు. నింబంధనల బౌలర్ రన్-అప్ సమయంలో వికెట్ కీపర్ కదలడానికి అనుమతి లేదు. దీంతో అంపైర్‌లు 5 పరుగుల పెనాల్టీ విధించారు. కాగా అంతకుముందు ఈ మెగా ఈవెంట్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు కూడా ఐదు పరుగుల జరిమానా విధించారు. ఆప్పడు బంతి డికాక్‌ గ్లౌవ్‌కు తాకడంతో అంపైర్‌లు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు.


చదవండిIPL 2023: శార్దూల్ ఠాకూర్‌కు ఢిల్లీ క్యాపిటిల్స్‌ గుడ్‌బై!

మరిన్ని వార్తలు