WI Vs Eng 2nd Test- Joe Root: జో రూట్‌ అరుదైన సెంచరీ.. దిగ్గజాలను వెనక్కి నెట్టి..

17 Mar, 2022 10:49 IST|Sakshi
జో రూట్‌ అజేయ సెంచరీ(PC: ICC)

WI Vs Eng 2nd Test- Joe Root: ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ జో రూట్‌ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 25వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో బార్బడోస్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఈ ఫీట్‌ అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో 24 సెంచరీలు నమోదు చేసిన గ్రెగ్‌ చాపెల్‌, వివియన్‌ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు, మహ్మద్‌ యూసఫ్‌, కేన్‌ విలియమ్సన్, డేవిడ్‌ వార్నర్‌ వంటి క్రికెటర్లను వెనక్కి నెట్టాడు.

వీరి కంటే రూట్‌ ఒక అడుగు ముందు వరుసలో నిలిచాడు. ఈ క్రమంలో బ్యాట్‌తో అభివాదం చేస్తూ మైదానంలోని అభిమానులతో రూట్‌ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా అతడి పేరును పాటగా ఆలపిస్తూ ఫ్యాన్స్‌ అభినందనలు తెలిపారు. కాగా విండీస్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ఓపెనర్‌ జాక్‌ క్రాలే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో వనౌడౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ రూట్‌ 246 బంతుల్లో 119 పరుగులు(నాటౌట్‌) సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మరో ఓపెనర్‌ అలెక్స్‌ లీస్‌ 30 పరుగులు చేసి నిష్క్రమించగా.. క్రీజులోకి వచ్చిన డానియెల్‌ లారెన్స్‌ 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌ 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.

చదవండి: MS Dhoni: నెంబర్‌-7 మిస్టరీ వెనుక మనం ఊహించని ట్విస్ట్‌
IPL 2022- Suresh Raina: రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఎట్టకేలకు ఐపీఎల్‌లో ఎంట్రీ! అయితే..

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు