WI vs SL: తలకు బలంగా తగిలిన బంతి.. ఫీల్డ్‌లోనే కుప్పకూలాడు

21 Nov, 2021 15:25 IST|Sakshi

Jeremy Solozano taken to hospital after blow to head.. వెస్టిండీస్‌- శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విండీస్‌ క్రికెటర్‌ జెరెమీ సోలోజానో అనూహ్యరీతిలో గాయపడ్డాడు. ఆట తొలి సెషన్‌లో 24వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. రోస్టన్‌ చేజ్‌ వేసిన షార్ట్‌ డెలివరిని లంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే షార్ట్‌లెగ్‌ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న జెరెమీ సోలోజానో హెల్మెట్‌కు తాకింది. అయితే షాట్‌ పవర్‌ఫుల్‌ కావడంతో హెల్మెట్‌ గ్రిల్స్‌ అదిరి తలకు బలంగా తాకింది.

చదవండి: Tim Paine scandal: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్‌ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు

దీంతో సోలోజానో ఫీల్డ్‌లోనే కిందపడిపోయి నొప్పితో విలవిల్లాడాడు. కాసేపటికి ఫిజియో వచ్చి అతన్ని పరీక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా జెరెమీ సోలోజానోకు టెస్టుల్లో ఇదే డెబ్యూ మ్యాచ్‌ కావడం విశేషం. ఈ ఘటనతో అటు లంక, విండీస్‌ క్రికెటర్లు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం సోలోజానోను స్కానింగ్‌, వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో ఉంచారు. అతను తొందరగా కోలుకోవాలని క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న శ్రీలంక మూడో సెషన్‌లో 61 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్‌ కరుణరత్నే 90, మాథ్యూస్‌ 1 బ్యాటింగ్‌ ఆడుతున్నారు. అంతకముందు పాతుమ్‌ నిస్సంక 56 పరుగులు చేసి ఔటయ్యాడు. 

చదవండి: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. 115 ఏళ్ల తర్వాత.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బౌలర్‌

మరిన్ని వార్తలు